Telugu News

బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదు

టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు - చింత నిప్పు కృష్ణ చైతన్య

0

బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదు

టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు – చింత నిప్పు కృష్ణ చైతన్య

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దహనం చేసిన యువజన విభాగం నేతలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు పెద్ద ఎత్తున యువతతో కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశకు గురి చేసిందని, రైతు యువత విద్యార్థి కర్షక కార్మిక ఉద్యోగ వేతన జీవులకు నిరాశ మిగిల్చిందని, కనీసం బడ్జెట్లో యువతకు స్వయం ఉపాధి కల్పనకు కేటాయింపులు జరగలేదని, కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వక యువతను మోసం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్నాయకత్వంలో ప్రభుత్వ పరంగా ఒక లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేసింది.

also read :-ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ : జావిద్

కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా యువత తీవ్ర అన్యాయం చేసింది. కనీసం బడ్జెట్ కేటాయింపులలో కూడా తీవ్ర అన్యాయం చేసింది. గోల్మాల్ బడ్జెట్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని వర్గాల వారిని అయోమయం చేసిందని, రైతుల విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రాయితీలను ఎక్కడ కూడా ప్రకటించలేదు పోయిందని, తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి వాటిని కూడా డా ప్రైవేట్ బడాబాబులకు దారాదత్తం చేస్తోందని, తద్వారా ప్రైవేటు సర్కార్ ను కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని, రైతు ఉద్యోగ నిరుద్యోగ కార్మిక కర్షక లోకానికి ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని, ప్రాజెక్టులకు, జాతీయ రహదారులకు కొత్త రైల్వే లైన్లకు నిధుల కేటాయింపు చేయలేకపోయింది. నిధుల కేటాయింపు చేయలేక పోగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది.

also read :-పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన

ఇదే విధానాలు కొనసాగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం పతనం ఖాయం అని, దేశవ్యాప్తంగా యువతలో మార్పు వస్తుందని, అన్ని వర్గాల ఆలోచనతో బిజేపి పతనం తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్లు షేక్ బాజీ బాబా,బోజెడ్లదిలీప్,
టిఆర్ఎస్ నగర యువజన విభాగం అధ్యక్షులు దేవభక్తిని కిషోర్, నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు బలుసు మురళీకృష్ణ, తౌసిఫ్, నాయకులు శీలం శ్రీనివాస్, రమేష్, సాయి, విజేత,చిక్కుళ్ల నాని, పవన్,వీర, జాని, సాయి, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.