బీజేపీ,టీఆర్ఎస్ గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వాలు: రాయల
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
బీజేపీ,టీఆర్ఎస్ గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వాలు: రాయల
== బిజెపి,టిఆర్ఎస్ పట్ల గిరిజనలు అప్రమత్తంగా ఉండాలి
== హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
(కూసుమంచి-విజయంన్యూస్)
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గిరిజనుల వ్యతిరేఖ ప్రభుత్వాలని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం ఎంతో చేసిందని, గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడంతో పాటు అనేక పథకాలను అందించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. గురువారం కూసుమంచి మండలం లాల్ సింగ్ తండా గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఇంటింట ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి హాత్ సే హాత్ జోడో యాత్ర పోస్టర్లను అంటించి, వరంగల్ డిక్లరేషన్ పత్రాలను గిరిజన ప్రజలకు అందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతు ప్రజల సమస్యలను తెలుసుకుంటు గడప గడపకు వెళ్ళి గిరిజనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌసం చేస్తున్న తీరును వివరించి,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తు హాథ్ సే హాథ్ జోడో యాత్రను కోనసాగిస్తున్నారు..ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య, మండల నాయకులు యడవల్లి రాంరెడ్డి, మంకెన వాసు, బానోతు రాములు నాయక్, బొంగా నాయక్, బెల్లి శ్రీశైలం, క్రిష్ణమూర్తి, జేరిపోతుల అంజిని, బచ్చలకూర నాగరాజు, యడవల్లి నాగరాజు, బోయిన వేణు, రామయ్య, మల్లన్న, కృష్ణయ్య, పెద్దిరెడ్డి, ఉపేందర్, రాజు, దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: సామాన్యుడిపై గ్యాస్ బండ: కాంగ్రెస్