Telugu News

టీఆర్ఎస్ ఎంపీలకు కేంద్రం జలక్

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలకు చైర్మన్ల పదవులు తొలగింపు

0

టీఆర్ఎస్ ఎంపీలకు కేంద్రం జలక్

== పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలకు చైర్మన్ల పదవులు తొలగింపు

న్యూఢిల్లీ : పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్‌కు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎంపీలు
కేశవరావు, నామా నాగేశ్వరావుల చైర్మెన్ పదవులను కేంద్రం తొలగించింది. టీఆర్‌ఎస్‌కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్‌ను నియమించలేదు. ఇప్పటివరకు పరిశ్రమలశాఖ కమిటీ చైర్మెన్‌గా ఉన్న కేశవరావు.. ఇక ఆ కమిటీలో సభ్యునిగా మాత్రమే కొనసాగనున్నారు. అలాగూ లైబ్రరీ కమిటీ చైర్మెన్‌గా ఉన్న నామా కూడా ఆ కమిటీలో సభ్యునిగా ఉండనున్నారు. పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ ఇటీవలె పార్లమెంట్‌ బులెటిన్‌ విడుదల చేసింది.ఇదింతా టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారినందుకేనంటూ ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరు చూస్తూనే ఉన్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నుంచి పోటీ చేయండి సార్.. గెలిపిస్తం