Telugu News

తీగల గుట్టపల్లికి చేరిన పాదయాత్ర

బిజెపి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్

0

శాంతియుత సమాజమే మానవాళికి శ్రేయస్కరం …

బిజెపి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్

(కరీంనగర్-విజయం న్యూస్)

 ప్రపంచ దేశాల్లో శాంతియుత వాతావరణం నెలకొన్న అప్పుడే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని, శాంతియుత జీవనమే మానవాళికి శ్రేయస్కరమని, ప్రతి ఒక్కరు శాంతియుత సమాజానికి కృషి చేయాలని , శాంతియుత సమ సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని బిజెపి కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్ అన్నారు.నేషనల్ యూత్ ప్రాజెక్ట్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి – సద్భావన- అహింస పాదయాత్ర శుక్రవారం కరీంనగర్లోని ఒకటో డివిజన్ తీగల గుట్టపల్లి కి చేరింది. సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం నుండి అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసాదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేషనల్ యూత్ ప్రాజెక్ట్ తెలంగాణ శాఖ గత నాలుగు రోజుల క్రితం గోదావరిఖని నుండి బాపు ఘాట్ లంగర్ హౌస్ హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం తీగల గుట్టపల్లి ఒకటో డివిజన్ కు చేరుకోవడంతో 1వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి , పాదయాత్ర కన్వీనర్ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షులు కె . యాదవ్ రాజు, వారి బృందాన్ని ఆయన సన్మానించారు. అనంతరం కరీంనగర్ లోని నెహ్రూ యువ కేంద్రం వరకు పాదయాత్రతో తరలి వెళ్లిన కార్పొరేటర్ శ్రీనివాస్ నెహ్రూ యువకేంద్ర ఆర్డినేటర్ రాంబాబు ను కలిసి పాదయాత్ర ఆవశ్యకతను వివరించి మాట్లాడారు . నేటి మానవ సమాజానికి కావాల్సినప్రేమ , ఆప్యాయతలు కనుమరుగై ద్వేషాల తో అశాంతి వాతావరణం నెలకొంటుందని , దీంతో సమాజంలో అనేక విద్వేషాలు చెలరేగిపోయి అశాంతి జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . శాంతియుత సమాజ స్థాపన కోసం ప్రజలందరూ కృషిచేయాలని ముఖ్యంగా యువత సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు .

పాదయాత్ర కన్వీనర్ కె .యాదవ్ రాజు, అకౌంటెంట్ రవీందర్ మాట్లాడుతూ ప్రజలందరూ అందరూ క్షేమంగా ఉన్నప్పుడే విశ్వశాంతి జరుగుతుందని, సమాజంలో ప్రతి ఒక్కరు సద్భావన తో, మంచి అభిప్రాయాల తో శాంతియుత జీవనం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం , ఉన్మాదం ఆరాచకత్వాలను సమాజాన్ని బలి కానివ్వకుండా, యువత చెడు అలవాట్లకు లోనవ్వకుండామత్తుపదార్థాల చెడు సంస్కృతికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. మహాత్ముడొసగిన‌ శాంతి అహింస సత్య విధానాలను అవలంబించి శాంతి – న్యాయ సమాజ స్థాపనకు యువత నడం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ గాంధేయవాది తోట లక్ష్మణరావు , యూత్ సభ్యులు సతీష్ , నరేష్ , వీరేశం , కనకయ్య , శివ , వంశీ , సృజన్ , చందన్ , సాయి , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

also read: ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం