Telugu News

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీది: తమ్మినేని

మల్లేపల్లి లో సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తమ్మినేని...

0

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీది: తమ్మినేని

== సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…

== మల్లేపల్లి లో సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తమ్మినేని…

== పార్టీ కార్యాలయాలు పోరాటాల కేంద్రంగా ఉండాలి…

== పోతినేని సుదర్శన్ రావు,నున్న నాగేశ్వరరావు

(కూసుమంచి-విజయంన్యూస్)

భారత దేశంలో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేకుట్ర కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శనివారం మండలంలోని మల్లెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ…

ఇది కూడా చదవండి: మోడీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలి: తమ్మినేని 

దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది సంవత్సరాల కాలంలో మతాలను రెచ్చగొట్టి ప్రజలను వేరు చేస్తూ, కులాలను మధ్య చిచ్చుపెట్టి కులాలను వేరు చేస్తూ బిజెపి పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని ,బ్రిటిష్ పాలకుల కంటే బిజెపి పాలకులు అంచుచున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా ఉందన్నారు. దేశంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నాలు ఈ మోడీ ప్రభుత్వం చేస్తుందని, ఇలాంటి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే దేశ సంపదను కార్పొరేట్ దోపిడిగాళ్ళకు, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పజెప్పే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.

== పార్టీ కార్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా ఉండాలి: పోతునేని సుదర్శన్ నున్న నాగేశ్వరరావు..

సిపిఎం పార్టీ కార్యాలయాలు ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రజల సమస్యల పరిష్కరించే వేదికలుగా, పోరాటాల ఉద్యమ కేంద్రాలుగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ బరిలో తమ్మినేని

తాళ్ళురి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు  బండి పద్మ,గుడవర్తి నాగేశ్వరరావు,కె.వి.రెడ్డి, సూర్యాపేట జిల్లా నాయకులు బుర్రి శ్రీరాములు,మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, ,మండల కార్యదర్శి వర్గ  సభ్యులు తోటకూరి రాజు,గ్రామ శాఖ కార్యదర్శి చీర్ల రాధాకృష్ణ,గ్రామ సర్పంచ్ పి.నాగేశ్వరావు,మండల కమిటీ సభ్యులు,గ్రామశాఖ సభ్యులు, అభిమానులు, సానుభూతిపరులు, పాల్గొన్నారు