Telugu News

దూసుకపోతున్న ‘గని’ టీజర్‌..

=సంబురాల్లో మెగా అభిమానులు

0

దూసుకపోతున్న ‘గని’ టీజర్‌..
==సంబురాల్లో మెగా అభిమానులు
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేందర్ బాబు కుమారుడు వరణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ మూవి ‘గని’ టీజర్ దూసుకపోతుంది. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్తో వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉందంటూ మెగా ప్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో విడుదలైన ‘గని’ టీజర్‌ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

also read ;-ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్‌ మూవీకి కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ వరుణ్‌ తేజ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్‌ ఆకట్టుకోగా ఇటీవల వచ్చిన తమన్నా స్పెషల్‌ సాంగ్‌కు విశేష స్పందన లభించింది. ఇక ఈరోజు వరుణ్‌ తేజ్‌ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీత దర్శకుడు.