Telugu News

ప్రజలందరు చల్లగా ఉండేలా దీవించండి గణేషా: పొంగులేటి

కూసుమంచి మండలంలో పర్యటించిన పొంగులేటి

0

ప్రజలందరు చల్లగా ఉండేలా దీవించండి గణేషా: పొంగులేటి

== కూసుమంచి మండలంలో పర్యటించిన పొంగులేటి

== వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు

== అన్నదానాలకు అర్థిక చేయూతనందించిన మాజీ ఎంపీ

(కూసుమంచి-విజయంన్యూస్)

ఏకదంతాయ… వక్రతుండాయ… గౌరీతనయాయ వినాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ సుఖసంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని… సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని, ఆ విధంగా గణనాథుడు దీవించాలని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విఘ్నేశ్వరుడ్ని కోరారు.  పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో ఆదివారం పర్యటించారు. మండలంలోని నాయకన్ గూడెం, కూసుమంచి, పాలేరు, జీళ్ళచెరువు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. విరాళాలను కానుకగా సమర్పించారు. ప్రతి విగ్రహానికి రూ.5వేల అర్థిక సహాయం అందించారు.  ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వానికి చవితి ప్రేమ

ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మట్టె గురవయ్య, సర్పంచ్ లు చెన్నా మోహన్, సూర్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య,  భూపాల్ రెడ్డి, కిరణ్, వీరభద్రం, మైపాల్, వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, సుధాకర్ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీష్మాచారి, సత్యనారాయణ, వీర్నన్న, కేశవరెడ్డి, పందిరి సత్యనారాయణ రెడ్డి, ఇందుర్తి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, సైదానాయక్, వీర్యా నాయక్, మల్సూర్, చందర్, పుల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వీరన్న, గంగయ్య, ఐతగాని ప్రభాకర్, రాంగోపాల్, రాఘవ, నాగేశ్వరరావు, వెంకన్న, వార్డు సభ్యుడు రంగయ్య తదితరులు ఉన్నారు.

== ఖమ్మం రూరల్ మండలంలో

ఖమ్మంరూరల్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని కె.ఎల్. ఆర్. బృందావనం, రాజీవ్ గృహకల్ప, నడిమితండా, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. ఆయా మండపాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్,కామ్రెడ్ల పొత్తు సంగతేంటి..?

ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, ముత్తగూడెం సర్పంచ్ గోనె భుజంగ రెడ్డి, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, ఏనుగు వెంకట రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కర్లపూడి భద్రకాళి, ఉత్తేజ్, చీకటి శ్రీను, నగేష్, కె.వి. చారి, భూక్య కళ్యాణ్, ప్రభాస్, శ్రీ కళా రెడ్డి తదితరులు ఉన్నారు.

== ఖమ్మం నియోజకవర్గంలో

ఖమ్మం : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని సుందరయ్య నగర్, గాంధీనగర్, జహీర్ పుర తండా, శ్రీనివాసనగర్, బోనకల్ రోడ్, శ్రీరామ్ నగర్, బి.కె. బజార్, రిక్కాబజార్, కైకొండాయిగూడెం, పాండురంగాపురం, గాంధీచౌక్ తో పాటు రఘునాథపాలెం మండలంలోని రాంక్యా తండా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. ఆయా మండపాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన, ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు.

ఇది కూడా చదవండి: నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

ఈ పర్యటనలో పొంగులేటి వెంట కార్పొరేటర్ దొడ్డా నగేష్, కొప్పెర ఉపేందర్, షేక్ ఇమామ్, బోడా శ్రావణ్ కుమార్, దుంపల రవికుమార్, బాణాల లక్ష్మణ్, పాలకుర్తి నాగేశ్వరరావు, చెల్లా రామకృష్ణ రెడ్డి, అర్వపల్లి శివ, రుడావత్ రమాదేవి, కాంపాటి రమేష్, ఉపేందర్, షేక్ కరీం, శీతల హరినాథ్, ఉత్తేజ్, రాము, యువనేత గోపి తదితరులు ఉన్నారు.