Telugu News

దీవించు పెద్దమ్మ: పొంగులేటి 

తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటన

0

దీవించు పెద్దమ్మ: పొంగులేటి 

– తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటన

– పెద్దమ్మతల్లి గుడి ప్రతిష్టా మహోత్సవంలో ప్రత్యేక పూజలు

(ఖమ్మం/తిరుమలాయపాలెం-విజయంన్యూస్):

 పంటలు సమృద్ధిగా పండేటట్లు సకాలంలో వర్షాలు కురిపించి… ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రతిఒక్కరూ ధనధాన్యలతో తులతూగేటట్లు దీవించాలని పెద్దమ్మతల్లిని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వేడుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనలో భాగంగా బచ్చోడు గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి గుడి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కారించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.ఇది కూడా చదవండి: మాకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత: పొంగులేటి

== ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి పర్యటన

ఖమ్మం రూరల్ :  ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రెడ్డిపల్లి, దానవాయిగూడెం గ్రామాల్లో జరిగిన శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ, జిల్లా నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, సుదగాని ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మెండె వెంకటేష్ యాదవ్, గునగంటి రమేష్, బాణోతు లక్ష్మణ్, మహేష్, ప్రవీణ్, కృష్ణ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి సింహం..సింగిల్ గానే వస్తుంది: స్వర్ణకుమారి