Telugu News

నన్ను ఆశీర్వదించండి.. మీకోసం పనిచేస్తా: రఘురాంరెడ్డి 

ఖమ్మం, మధిర, కొత్తగూడెంలలో ఓట్ల అభ్యర్థన

0

నన్ను ఆశీర్వదించండి.. మీకోసం పనిచేస్తా: రఘురాంరెడ్డి 

== కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం*

==  ఖమ్మం, మధిర, కొత్తగూడెంలలో ఓట్ల అభ్యర్థన

(మధిర/కొత్తగూడెం/ఖమ్మం-విజయం న్యూస్):

కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఉభయ జిల్లాల్లో విస్తృత ప్రచారం చేశారు. శుక్రవారం ఉదయం మధిర లో మార్నింగ్ వాకర్లతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఆ తర్వాత ఈత మిత్రులతో కలిసి .. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి:- రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ మాత్రమే: రాహుల్ గాంధీ

మధిరలో కాంగ్రెస్ కార్యాలయంలో.. ముస్లిం మైనారిటీల సదస్సులో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీని మత రాజకీయాలు చేస్తోందని.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం కొత్తగూడెంలో ముస్లిం ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
*నరసయ్య పార్థివదేహానికి నివాళి*
కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బందుల నర్సయ్య అనారోగ్యంతో మృతిచెందగా.. ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి రామ సహనం రఘురాo రెడ్డి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింగరేణి బొగ్గు గాని ప్రాంతాన్ని సందర్శించి కార్మికులు, అధికారులతో కలిసి మాట్లాడారు. సదా అండగా ఉంటామని అభయమిచ్చారు.
*ఖమ్మంలో..* రఘునాధపాలెం మండలం వీవీ.పాలెం, నగరంలోని ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు