Telugu News

నూతన వదువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి-విజయంన్యూస్

0

నూతన వదువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కందాళ
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం విస్త్రతంగా పర్యటించారు. ముందుగా కూసుమంచి మండలంలోని రాజుపేట బజార్లో నూతన దంపతులు కంపసాటి సురేష్-శీరీష లను ఆశీర్వదించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, అనంతరం కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామంలో జావ్వాజి వీరస్వామి-సుభద్ర కుమారుని వివాహ వేడుకలు హాజరై,నూతన వధూవరులు సాయి కుమార్-వెంకట సృజన లను ఆశీర్వదించారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో బోనగిరి రాజేంద్రప్రసాద్ కుమార్తె జోత్స్నని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, కల్లూరిగూడెం సోసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం, సర్పంచ్ బాదావత్ బీబ్లీ, బాదావత్ రవినాయక్, యడవల్లి ముత్తయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, మాజీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.

also read :-పశు గోస పట్టదా?? వెంకటాపురం పశు వైద్యశాలకు తాళం
== తిరుమలాయపాలెంలో
తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామ పరిధిలోని చర్చి నందు వివాహ వేడుకకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉఫేందర్ రెడ్డి హాజరైయ్యారు. ,నూతన వధూవరులు గాజుల క్రాంతి కుమార్-లావణ్య లను ఆశీర్వదించారు. అనంతరం చంద్రు తండాలో డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ మాలతీ అన్న ఐపీఎస్ బోడా పాపలాల్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాని పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బాణోత్ బావుసింగ్ కుటుంబాని పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. తిరుమలాయపాలేం మండలం సుబ్లేడు గ్రామంలో వంగ వెంకన్న-సుమతి కుమారుడు ఉమేష్ గౌడ్ ని ఆశీర్వదించిన ఎమ్మెల్యే రిమోట్ ఫ్యాన్ పంపిణీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో టీఎస్ ఆర్ఈడీసీవో ఖమ్మం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సబ్సిడీతో డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళల సంఘాల సభ్యులకు రిమోట్ ఫ్యాన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోడా మంగిలాల్, నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.