Telugu News

’సండ్ర‘ ఇంటి స్థలంపై నీలినీడలు

గతంలోనే మరో శాఖకు బదలాయింపు..?

0

సండ్ర ఇంటి స్థలంపై నీలినీడలు

== ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 22ఏళ్లుగా నివాసం ఉంటున్న సండ్ర

== పదవిలో ఉండగానే  2017లోనే మరోకరికి కేటాయించిన అధికారులు

== 2020లో రెగ్యూలరైజేషన్ చేస్తూ జీవో

== 2022 లో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు

== నోటీసులు ఇవ్వలేదంటున్న ఎన్ఎస్ పీ అధికారులు

== గతంలోనే మరో శాఖకు బదలాయింపు..?

== అసలేం జరుగుతోంది..?  ఫార్ట్ -2

ఆయనో దళిత ఎమ్మెల్యే..వరసగా మూడు సార్లు.. మొత్తం నాలుగు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే అతను..  మొదటిగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఒకే ఇంట్లోనే ఉంటున్నాడు.. ఆయన సీనియార్టీకి అద్భుతమైన ఇండ్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది.. కానీ ఆయన నమ్ముకున్న ఇంటికే పరిమితమైయ్యాడు.. ఆ ఇంట్లో నుంచే పరిపాలన సాగిస్తున్నాడు.. ఆయన ఇళ్లు అంటే తెలియని నాయకుడేవ్వరు లేరు..

ఇది కూడా చదవండి:  ఎమ్మెల్యే సండ్ర ఇళ్లు పాయే

అలాంటి మచ్చ లేని నాయకుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఏనాడు రాజకీయ తగాదాలు లేని వివాహద రహితుడు. ప్రజలను నమ్ముకుని పరిపాలన చేస్తున్న వ్యక్తి.. ప్రజలు సండ్రను అదే స్థాయిలో చూస్తారు.. అంతటి అభిమానం చూపిస్తారు..? ఆయనకు ఓటమి ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో  ఆయన నివాసం ఉండే ఇంటిపై కొందరికి కన్ను పడింది.. కచ్చితంగా ఖాళీ చేయించాలని సిద్దమైయ్యారు.. అందుకు గాను చకచక పనులు జరుగుతున్నాయి.. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న ఈ తరుణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాసం ఉండే ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్ల తెలుస్తోంది.. ఆయన ఇంటిని పూర్తిగాఖాళీ చేయించాలనే కుట్ర జరుగుతుందని పలువురు సండ్ర వర్గీయుల భావిస్తున్నారు.. ఏదేమైనప్పటికి సండ్ర ఇళ్లు మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు సండ్ర వెంకటవీరయ్య ఇంటిపై అధికారులు కన్నేశారు.. ఎందుకు ఆయన ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తోంది.. ప్రభుత్వం జీవో ఎందుకు విడుదల చేయలేదు..? వీటన్నింటికి సమాధానమే ‘విజయంన్యూస్’ ప్రత్యేక కథనం ఈ వార్త..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటి విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది..  తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో గత 22 ఏళ్ల క్రితం  ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య కేటాయించిన ఇంటిపై ఇన్నేళ్ల తరువాత స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది… ఇటీవలే  తెలంగాణ ప్రభుత్వం  రెగ్యూలరేజేషన్ చేసినట్లే చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికి అక్కడ రాజకీయ రంగు పులుముకుందనే ప్రచారం జరుగుతోంది..  ఓ ముఖ్యనాయకుడు వ్యక్తిగత రాజకీయ స్వార్థంతో ఆ ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతుందని పలువురు సండ్ర అభిమానులు, అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే అసలేం జరిగింది..? ఎందుకు ఆయన ఇంటిని ఇప్పుడు గుంజుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది.. పూర్తి వివరాలు చూద్దాం .. ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన సండ్ర వెంకటవీరయ్య విద్యార్థి నుంచే రాజకీయ ప్రవేశం చేశారు. ఎస్ఎఫ్ఐ లో ప్రారంభమైన తన  రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా మార్చింది..  అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన సండ్ర వెంకటవీరయ్య వరసగా మూడు సార్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా, మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించే వరకు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది..

ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల జోలికి వస్తే తాట తీస్తాం: కూనంనేని

సండ్ర వెంకటవీరయ్య పాలేరు నియోజకవర్గం నుంచి 1994లో సీపీఎం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం  జరిగిన ఎన్నికల్లో సండ్ర ఓడిపోగా, ఆ తరువాత ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాయంలో టీడీపీ పార్టీలో చేరి 1999లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.అయితే అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఎస్ఫీ క్వార్టర్స్ లో సీ/2 క్వార్టర్స్ ను కేటాయించగా, ఆ ఇంటిని పూర్తి స్థాయిలో సండ్రకు అవకాశం కల్పించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో సండ్ర ఓటమి చెందారు. అనంతరం 2009లో పునర్వీభజనలో భాగంగా  సత్తుపల్లి నియోజకవర్గం వెళ్లి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వరసగా మూడు సార్లు టీడీపీ పార్టీ నుంచి విజయం సాధించారు.  రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి సండ్ర వెంకటవీరయ్య టీడీపీ పార్టీలోనే ఉండిపోయారు. అప్పటి నుంచి ఆ క్వార్టర్స్ లోనే నివాసం ఉంటున్న సండ్ర మూడవ సారి గెలిచిన అనంతరం ఆయన 2020లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో సండ్రకు మంత్రి పదవి ఆపర్ వచ్చిందని, కోట్లాది  రూపాయలను గిప్ట్ గా ఇచ్చారని పుకార్లు షికార్లే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతలోనే ఖమ్మంలో తను 20ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎన్ఎస్పీ క్వార్టర్స్ లోని ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంను, కొంత పక్క ఖాళీల స్థలంను రెగ్యూలరైజ్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న సండ్రకు సీఎం కేసీఆర్ గిప్ట్ గా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో నేరుగా ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.. ఆ సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే రెగ్యూలరైజేషన్ చేసిన భూమి తన స్వంతం అయినట్లేగా.. మరీ ఎందుకు ఆస్థలంపై నోటీసులు జారీ చేశారు..? ఎక్కడో తేడా కొడుతున్నట్లుందే..? ఇంకా చదువుదాం..?

==  నోటీసులిచ్చిందేవరు..? ఎందుకు వచ్చింది..?

ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో 1994లో ఎమ్మెల్యేకు కేటాయించిన తాత్కాలిక నివాసం(ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం)ను ఆయన ఓటమి అనంతరం కూడా ఆయనకే కేటాయించారు. 1994 నుంచి 2022 వరకు సండ్ర వెంకటవీరయ్య ఆ ఇంటినే క్యాంఫ్ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. రెండు సార్లు అంటే పదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా లేని సమయంలో కూడా సండ్ర వెంకటవీరయ్యకు ఎన్ఎస్పీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ నోటీసులు ఇవ్వలేదు. కనీసం మందలించిన నాథుడే లేరు.. అంతే కాకుండా ఆయన గెలిచిన, ఓడిన ప్రతి సారి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. 1994లో సీపీఎం పార్టీ ఎమ్మెల్యేగా, 1999లో 2004 సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత అధికార టీడీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు ఆయన్ను ఎవరు ఖాళీ చేయమని అడగలేదు..

ఇది కూడా చదవండి: కన్నీటి పర్వంతమైన సీఎల్పీనేత

ఆ తరువాత 2009 నుంచి 2018 ఎన్నికల వరకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో కూడా వాళ్ల పార్టీ అధికారంలో లేదు. ఆయన 2020లో అధికార పార్టీలో చేరారు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. కనీసం ఖాళీ చేయమని అడగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఖాళీ చేయమని అడుగుతున్నారు..? కాదుకాదు.. హెచ్చరిస్తున్నట్లు సమాచారం..? నోటీసులు ఎందుకు వచ్చాయి.. ఎందుకు ఖాళీ చేస్తున్నారు..?  అయితే నోటీసుల విషయంలో ఎన్ఎస్పీ అధికారులను వివరణ కోరగా మా శాఖ నుంచి నోటీసులు పంపించలేదని చెబుతున్నారు. అయితే రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు వచ్చాయా..? లేదా..? తరువాత సంగతి..? సీఎం కేసీఆర్ ఇచ్చిన రెగ్యూలరైజేషన్ ఎటుబోయింది.. అప్పటికప్పుడు జీవో జారీ చేశారని పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. జీవో కాఫీ బయటకు వచ్చింది.. కానీ రెగ్యూలరైజేషన్ అయినట్లా..? కానట్లా..?

== నోటీసులు వెనక అసలు రహస్యమేంటి..?

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కేటాయించిన భూమి ఎన్ఎస్పీ శాఖకు సంబంధించినది. అయితే ఆ శాఖ నుంచి బదిలీ కావాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనసరి. కనీసం కేంద్రజలవనరుల శాఖకు ప్రభుత్వం లేఖను రాసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భూమిని ఉపయోగించుకోవడానికే తప్ప భూ హక్కును బదిలీ చేసే హక్కు రాష్ట్రానికి లేదని తెలుస్తోంది.  అలా చేయని యేడల ఆ శాఖకు సంబంధించిన భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి భూ హక్కు బదిలీ చేసే హక్కు లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెగ్యూలరైజేషన్ చెల్లలేదని తెలుస్తోంది..

ఇది కూడా చదవండి: నందిగామలో మంత్రి పువ్వాడ పర్యటన

ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా రద్దు అయినట్లుగా సమాచారం. అయితే ఇది మాత్రం గోప్యంగానే ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇందులో మరో కోణం దాగి ఉన్న సంగతి ఇటీవలే తెలిసింది.. తెలంగాణ ప్రభుత్వం మరో శాఖకు కేటాయించిన భూమిని సండ్ర వెంకటవీరయ్యకు గజానికి రూ.1 చొప్పున విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది.. ఇది వేరే ప్రభుత్వం చేసింది కాదు.. తెలంగాణ ప్రభుత్వమే ఆ ఇంటిని, స్థలాన్ని మరో శాఖకు బదలాయించి, ఇప్పుటు సండ్ర వెంకటవీరయ్య విక్రయాలు చేసినట్లు సమాచారం. ఇది ప్రభుత్వం తెలిసి చేసిన పెద్ద తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఏ శాఖకు కేటాయించారో..? ఇప్పుడు చూద్దాం.

== 2017లోనే మరో శాఖకు బదాలాయింపు చేసిన ప్రభుత్వం

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శాసనసభ్యుడిగా ఖమ్మం జిల్లాలోనే పనిచేస్తూ తనకు కేటాయించిన క్యాంఫ్ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఆ ఇంటిని, స్థలాన్ని న్యాయశాఖకు కేటాయించినట్లు సమాచారం. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత న్యాయశాఖ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆ స్థలాన్ని న్యాయమూర్తుల క్యాంఫ్ కార్యాలయంగా నిర్మాణం చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతి త్వరలోనే ఆ స్థలంలో  న్యాయమూర్తుల నూతన భవనాన్ని నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖ, రెవెన్యూ శాఖ నుంచి సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది.. దీంతో సండ్ర వెంకటవీరయ్య కూడా చేసేది లేక ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అసలు  సత్తుపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ప్రభుత్వ  నిబంధనల ప్రకారం ఆయన ఆ ఇంట్లో క్యాంఫ్ కార్యాలయంను కొనసాగిస్తుండగా ఇతరులకు కేటాయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..సండ్ర వెంకటవీరయ్యను అడిగి ఇతరులకు కేటాయించారా..? అడగకుండానే కేటాయించారా..?

                                               (అసలు జరిగిందేంటి..? ఫార్ట్-3 రేపటి సంచికలో..?)