Telugu News

వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో చత్తీస్గడ్ నుంచి కూలీలతో వస్తున్న బొలెరో వాహనం బోల్తా….

చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా

0

వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో చత్తీస్గడ్ నుంచి కూలీలతో వస్తున్న బొలెరో వాహనం బోల్తా….

లక్ష్మి అనే మహిళ మృతి…. పదిమందికి తీవ్ర గాయాలు….చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పాపన పెల్లి గ్రామానికి చెందిన కూలీలు వాజేడు మండలం ధర్మారం గ్రామానికి కూలి పని నిమిత్తం 20 మంది కూలీలతో బయలుదేరి వస్తుండగా టేకులగూడెం సమీపంలో మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతిచెందగా 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు… మృతి చెందిన మహిళను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ…