కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు.
(నేలకొండపల్లి/కూసుమంచి-విజయం న్యూస్)
కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని కూసుమంచి నుంచి నేలకొండపల్లి వేళ్ళే రోడ్డులో ముఠాపురం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగి ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. కాగా అదే మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వారిని గమనించి, కారు ఆపి ఆయన పరిస్థితిని చూశారు.
తీవ్రగాయాలై సృహలేని పరిస్థితి గమనించి ఆయన తన సొంత వాహనంలో నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ క్షతగాత్రుడికి దైర్యం చెప్పి వెళ్ళారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్ననమైయ్యారు.