Telugu News

తెలంగాణ ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు ఉన్నట్లు పోన్ కాల్..*

0

తెలంగాణ ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు..

*డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు ఉన్నట్లు పోన్ కాల్..*

*బాంబు ఉన్నట్లు 100 కాల్ చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి..*

*ప్రజాభవన్ లో తనిఖీలు చేపట్టిన డాగ్ స్క్వాడ్*

*ప్రగతి భవన్ లో ఉన్నవారిని బయటకు పంపిన పోలీసులు..*

*ఎలాంటి బాంబు లేకపోవడంతో పోన్ కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం ఆరా తీస్తున్న పోలీసులు..*

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణ ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది.. ఓ గుర్తు తెలియని వ్యక్తి 100 కాల్ చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు ఉన్నట్లు చెప్పడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రంలో బాంబ్ బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

ఇది కూడా చదవండి:- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..*

ఇప్పటికే ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు  పెక్ కాల్ రాగా, ఇప్పుడు ప్రగతి భవన్ లో బాంబ్ ఉన్నట్లు బెదిరింపు కాల్ రావడంతో ఒక్క సారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు ఉన్నట్లు 100 పోన్ కాల్ వచ్చింది.  ఓ గుర్తు తెలియని వ్యక్తి పోన్ చేయడంతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇంటిలిజెన్స్ పోలీసులు ప్రజాభవన్ లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రగతి భవన్ లో ఉన్నవారిని బయటకు పంపిన పోలీసులు.. క్షణంగా తనిఖీ చేశారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ని, అప్పుడే ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రి సీతక్కను బయటకు పంపించిన పోలీసులు, వారి వాహనాలను కూడా క్షుణంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రగతి భవన్ లో పని చేసే ప్రతి ఒక్కరిని గ్రౌండ్ లోకి పంపించి అందర్ని తనిఖీ చేస్తున్నారు. అయితే ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులు, ప్రభుత్వం ఊపిరిపిల్చుకుంది.  పోన్ కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం ఆరా తీస్తున్న పోలీసులు.. ఎక్కడ నుంచి వచ్చిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.