Telugu News

ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా: మంత్రి

0

ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా: మంత్రి

== రాజకీయాల కోసం కొందరిలా పుట్టిన గడ్డను మార్చను

== ఇప్పుడు ఖమ్మం.. ఆ తరువాత పాలేరు అని అనుకోను

== ఖమ్మంకు మంత్రి రావడం వల్లనే ఇంత అభివద్ది జరిగింది

== ఓడిపోయిన తుమ్మలను మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది

== స్వార్ధ రాజకీయాల కోసం కొందర్ని బలిచేస్తున్నారు

== బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు రుమర్స్,గోబెల్ ప్రచారాలు

== కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== ఖమ్మంలో ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్న మంత్రి అజయ్, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నేను ఖమ్మంలోనే పుట్టా.. ఖమ్మంలోనే పెరిగా.. ఖమ్మంలోనే ఎమ్మెల్యేగా అయ్యాను.. మంత్రిగా అవకాశం వచ్చింది.. అలా వచ్చింది కాబట్టే ఖమ్మం రూపురేఖలే మారాయి.. అభివద్దిలో నెంబర్ వన్ స్థానం సాధించింది.. ఖమ్మంలోనే పుట్టి పెరిగిన నేను పదవుల కోసం, రాజకీయాల కోసం ప్లేస్ మార్చను..

ఇది కూడా చదవండి:- రాజకీయ నిరుద్యోగులు వస్తున్నారు..జాగ్రత్త: మంత్రి

ఇప్పుడు ఖమ్మం, ఆ తరువాత పాలేరు అని అనుకోను.. నేను ఖమ్మంలోనే పోటీ చేశాను.. పోటీ చేస్తాను.. గెలుస్తాను.. రాజకీయాల కోసం స్వార్థప్రయోజనాల కోసం మాట్లాడనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఖమ్మంలో నాపై ఓడిన తుమ్మల నాగేశ్వరరావును పిలిచి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఆ తరువాత పాలేరుకు సిప్ట్ అయ్యారని తెలిపారు.  ఆనాడు సీఎం కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇవ్వకుంటే ఇప్పుడేక్కడ ఉండేవారో అర్థం చేసుకోవాలన్నారు. అందరిలా రాజకీయాల కోసం స్థలాలు మార్చేవాడ్ని కాదని, మాది గెలిచిన ఖమ్మమే.. ఓడిపోయిన ఖమ్మమేనని, కొందరిలా మారిపోవడం మాకు ఇష్టముండదన్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి పాలేరు వైపు పోదాం అనే ఆలోచన మాది  కాదన్నారు. నేను ఇక్కడ భూమిపుత్రుడిని, మీకోసమే పనిచేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

 ఇది కూడా చదవండి:- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకె ఇంత అభివృద్ధి చేసుకున్నామని, మరోసారి మంత్రి పదవి వస్తే ఎలా ఉంటుందో..? మీరే ఊహించుకోవాలన్నారు. కొందరికి కడుపు నొప్పి వస్తే అందరికి కడుపు నొప్పి రావాలి అని కొందరు భావిస్తున్నారని, అది వారి స్వార్ధ రాజకీయాల కోసం కొందర్ని బలి చేస్తున్నారని ఆరోపించారు. సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలి అని అనుకోవాలని, కానీ మర్రిచెట్టులా ఉంటే కుదరదన్నారు. యువకులు రాజకీయాలలోకి రావాలి అంటే మాకు అవకాశం ఇస్తేనే వస్తాం,కేసీఆర్ కూడా ఇంకొక తరాన్ని తయారుచేసుకోవాలంటే సీట్ల సర్థుబాటు తప్పదన్నారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని తుమ్మలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఖమ్మం అభివృద్ధిలో ముందు ఉంది,దానిని వెనుకకు నెట్టాలి అని కొందరు కలలు కంటున్నారని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రుమర్స్,గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలి అని చూస్తున్నారని, అలాంటి వారి పట్ల తస్మాత్ జాగ్రత్త

== అజయ్ గెలవడం ఖాయం: పువ్వాడ నాగేశ్వరరావు

ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ గెలవడం ఖాయమని,  మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఆయన గెలుస్తాడని, హ్యాట్రిక్ సాధిస్తాడని మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.. అత్మీయ సమ్మెళనం కార్యక్రమానికి హాజరైన పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ పువ్వాడ అజయ్ వల్లనే ఖమ్మం ఇలా అభివృద్ధి జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి:- తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?

ప్రజల సమస్యలను గుర్తించి, ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోకుండా పనిచేస్తున్నాడని, మన అందరి బాగోగులు చూసుకుంటాడని..మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అజయ్ అందరివాడు,కొందరివాడు కాదుని అన్నారు. ఖమ్మంను అభివృద్ధి చేయడంలో అజయ్ జయప్రదం అయ్యాడు,మరింత చేయాల్సి ఇంకా ఉందన్నారు.

అజయ్ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నాడని అన్నారు. నేను ఆశీర్వదిస్తున్న,మీరు కూడా ఆశీర్వదించండి విజయమే మనకు పరిష్కార మార్గమని అన్నారు.