Telugu News

ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారు: జావిద్

పోలీస్ల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు*

0

ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారు: జావిద్
*👉🏻ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావిద్ *
*👉🏻పోలీస్ల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు*

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లను ముట్టడించిన పోలీసులు హైజ్ అరెస్ట్ చేశారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. కొందర్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ తో పాటు ముఖ్యమైన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ లో కాంగ్రెస్ కు చెందిన కార్పోరేటర్లను కూడా ముందస్తు అరెస్ట్ లు చేశారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు లేనట్లే..?

== పోలీసు నిర్భందాలతో గొంతునొక్కుతున్నారు: జావిద్

పోలీసుల నిర్భందాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, అరెస్టులతో ప్రజాగొంతును, ప్రజల్లో వ్యతిరేకతను నిలవరించగలరా..? అని ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పీసీసీ సభ్యులు మహ్మద్ జావిద్ ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు కేటీ.రామారావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా  హైజ్ అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క
హౌస్ అరెస్ట్ లు పేరుతో ప్రభుత్వం ప్రతి పక్షాలను గొంతు ఎత్తకుండా చేయడం అప్రజాస్వామికమని ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు మండిపడ్డారు. శనివారం మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ను పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేటీఆర్ జిల్లా పర్యటన కు ఎలా వస్తావాని ప్రశ్నించినందుకు అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంగు ఆర్భాటాలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు దేశ దిమ్మరిల తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ముందు వాటిని అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార అహంతో అణచివేస్తే ప్రజలు మిమ్మల్ని అణచి వేస్తారని హెచ్చరించారు. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే హౌస్ అరెస్ట్ లు ఎందుకు అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో  పోస్టర్ వార్ ..