బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ ఆగ్రహం
?ఐటిసి పిఎస్పిడి యజమాన్యం ఆదివాసి మహిళా ప్రతినిధి
బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ ఆగ్రహం
?ఐటిసి పిఎస్పిడి యజమాన్యం ఆదివాసి మహిళా ప్రతినిధి
?బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే చాలా చులకన భావం తో చూస్తూ ప్రోటోకాల్ పాటించటం లేదు
(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )
సారపక ఐటిసి పిఎస్పిడి యాజమాన్యం గిరిజన మహిళ ని ఐనందున చిన్న చూపు చూస్తూ అగౌరపరిచేలా వ్యవహరిస్తున్నారని బూర్గంపాడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ మరిచి అను నిత్యం అవమాలకు సంబంధిత యాజమాన్యం పాలుపడుతుందని ఆమె విలేకరులతో ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూర్గంపాడు మండల పరిధిలోగల ఐటిసి పిఎస్పిడి యజమాన్యం ఆదివాసి మహిళా ప్రతినిధి బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే చాలా చులకన భావం తో చూస్తూ ప్రోటోకాల్ పాటించటం లేదున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ఉపాధి కల్పన ఉపాధి ని కనిపించడం లేదు ఇప్పటికీ ఐటిసి వారు ఈ ప్రాంతానికి ఆదివాసులు కు మేలు చేయడం కంటే కీడు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఉదాహరణకి జమాయిల్ చేయటం వలన భూగర్భ జలాల నీరు అడుగంటి పోతున్నాయి.
also read:-కొత్త రాజ్యాంగం అవసరమనే కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దీక్షలు.
తద్వారా ఇక్కడి ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు అని ఆమె అన్నారు. ఐటీసి ఈ ప్రాంతం కొరకు అభివృద్ధి చేసింది ఏమీ లేదని, ఆదివాసులు అంటే ఐటిసి వారికి లెక్క లేదుఅని ముత్యాలమ్మ మండి పడ్డారు. ఇప్పటివరకు ఉపాధి రంగంలో ఉపాధి లేకుండా ఆదివాసులు మిగిలి ఉన్నారు రాబోయే కాలంలో ఆదివాసులు అందరూ ఏకం కావాలి. మన ప్రాంతాన్ని ,మన జాతిని అవమాన పరుస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ ఎక్కడ కూడా ప్రోటోకాల్ గుర్తించటం లేదు ఆదివాసులను అవమాన పరిచినట్లు ఈ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళతాం అని ఆమె తెలిపారు.
ఈ ప్రాంతంలో ఐటిసి వారు వంద పడకల హాస్పిటల్ కల్పించాల్సిన బాధ్యత ఉన్న, గిరిజన ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నిధులు కేటాయించాలి.ఇవేమీ పట్టనట్లుగా యాజమాన్యం వ్యహరిస్తుందన్నారు. ప్రాంతం కొరకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే ఆదివాసి ప్రాంతంలో అభివృద్ధి చేయాలి ,ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తున్నారు వందల కిలోమీటర్ల దూరం వైద్యానికి వెళ్లాల్సి వస్తుంది కనీసం హైదరాబాదులో ఉన్నటువంటి అత్యాధునిక హాస్పటల్ ని కల్పించాలి కాలుష్యం ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఈ ప్రాంతవాసులు అంటే యజమానికి లెక్క లేదు పట్టించుకోరు తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే రేగా దృష్టికి సమస్యను తీసుకవెళ్తామన్నారు. ఈసమావేశంలో తెలంగాణ ఉద్యమ నేత పోడియం నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.