Telugu News

రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..*

గంగమ్మ ను పూజించి మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 

0

రాములోరికి మొక్కి..రంగంలోకి దిగి.

== గంగమ్మ ను పూజించి మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 

– మల్లేపల్లిలో ఆలయాల ప్రతిష్ట వేడుకల్లో ప్రత్యేక పూజలు

== స్వాగతం పలికిన గ్రామస్థులు 

(కూసుమంచి-విజయం న్యూస్)

మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు.

ఇది కూడా చదవండి:- నేడు మంత్రి పొంగులేటి జిల్లాలో పర్యటన

ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వచనం పొందారు. అనంతరం ఇదే గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుక కు హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..మొక్కుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ జూకూరీ గోపాలరావు, నాయకులు నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి, , రామ్మూర్తి నాయక్, హఫీజ్ ఉద్దీన్, కొప్పుల చంద్రశేఖర రావు, శ్రీనివాసరెడ్డి, తమ్మినేని నవీన్, సూర్య నారాయణ రెడ్డి, పెండ్ర అంజయ్య, సెట్ రామ్ నాయక్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ నామినేషన్ జోష్..!