నేటి నుంచి గార్లఒడ్డు లో బ్రహ్మోత్సవాలు.
(ఏన్కూరు విజయంన్యూస్ ): –
ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలోబుధవారం నుండి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 11 నుంచి 18వ తారీకు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా ఈనెల 14వ తేదీన త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనము లతో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ శిఖర సుదర్శన చక్ర ప్రతిష్ఠా మహోత్సవం, 16వ తేదీ రాత్రి స్వామివారి వార్షిక తిరు కళ్యాణం, 18 న స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని ఆలయ మేనేజర్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.