Telugu News

గార్లఓడ్డు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు

0

గార్లఓడ్డు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

== పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు

ఏన్కూరు మే 21:
ఏనుకూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.భగవత్ ఆరాధన,సేవాకాలం, బాలభోగం,ఆరగింపు, మంగళశాసనం, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధనం, యాగశాలప్రవేశం, హోమం,తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమలు జరిగాయి.ఇవి ఈ నెల 25వ తారీకు వరకు జరగనున్నాయి.23న రాత్రి స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ శేషయ్య,ప్రధాన అర్చకులు బీటుకూరి వేణుగోపాలచార్యులు, నాగరాజచార్యులు, కిరణ్ కుమార్ చార్యులు పాల్గొన్నారు.