Telugu News

గార్లఓడ్డులో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

0

గార్లఓడ్డులో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

ఏన్కూరు మే 25:(రిపోర్టర్ -చారి)

మండల పరిధిలోని గార్లఓడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి.యాగశాల ఆరాధనలు, నిత్యహోమం,మహాపూర్ణహుతి,చక్రస్థానం,అభిషేకం, పుష్పయాగం,దేవత ఉధ్వాసనం,పవళింపు సేవ,తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి.అర్చక,పరిచారక బృందంనకు సన్మానం,యజమానులకు వేదాశ్వరచనం కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో దాత జాలాది దొరబాబు దంపతులు,మద్దిగుంట నరసింహారావు,ఆలయ మేనేజర్ శేషయ్య, ప్రధాన అర్చకులు బిటుకూరి వేణుగోపాలచార్యులు,నాగరాజాచార్యులు,కిరణ్ కుమార్ చార్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- గార్లఒడ్డు లో వైభవంగా తిరువీధి ఊరేగింపు ఉత్సవం