Telugu News

ఊపిరున్నంత వరకు మీ కోసమే శ్రమిస్తా: కందాళ

అవకాశాల మాటలు నమ్మొద్దు

0

ఊపిరున్నంత వరకు మీ కోసమే శ్రమిస్తా: కందాళ
-అవకాశాల మాటలు నమ్మొద్దు
-స్థానికుడికి, స్థానికేతరుడికి తేడా గమనించాలి
-అర్ధ రాత్రి తలుపు తట్టినా పలుకుతా
-పాలేరు ఎమ్మెల్యే కందాళ
(కూసుమంచి-విజయం న్యూస్);-
నాకు ఊపిరి ఉన్నంత వరకు మీ కోసమే శ్రమిస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన స్వగ్రామంలో రూ 2 కోట్ల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిఎం కెసిఆర్ వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్, కెసిఆర్ కిట్స్ ఇలా పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గత 50 ఏళ్ల నుంచి మన కొచ్చిన ఎమ్మెల్యే లు మన ఊరి బిడ్డ సండ్ర వెంకట వీరయ్య తప్ప మిగతా వారంతా బయటి వారే అన్నారు. స్థానికుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో స్థానికేతరుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో ప్రజలు గమనించాలన్నారు.

also read;-బీహార్ లే తెలంగాణ ను నాశనం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

బయటి వారు ఎమ్మెల్యే అయితే ఆయన చుట్టూ బయటి వారే ఉంటారని సమస్యలు చెప్పుకోడానికి కూడా వీలుపడదన్నారు. అవకాశ వాదులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని వారి మాయమాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. బ్రతికున్నప్పడు ఏం చేయలేదు గానీ చనిపోయిన తర్వాత డబ్బులు ఇస్తున్నారంటూ మాట్లాడుతున్నారని అలా మాట్లాడే వారికేంతెలుసు పేదవాళ్ల భాదలన్నారు. కనీసం భాదలో ఉన్న వారి ముఖం కూడా చూడని వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

నియోజకవర్గ ప్రజలు ఏ ఆపదలో ఉన్నా అర్ధరాత్రి వచ్చి పిలిస్తే పలుకుతా అన్నారు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపిపిలు తేజావత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, జడ్పీటీసీ ఇంటూరి బేబి, టిఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, సొసైటీ చైర్మన్ లు కోటి సైదారెడ్డి, చంద్ర రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు గండు సతీష్, మాజీ సిడిసి చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆచర్లగూడెం సర్పంచ్ రేగూరి శ్రావణ్ కుమార్, వజ్జా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.