Telugu News

నల్గొండ లో బీఆర్ఎస్ బిగ్ షాక్….

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన గుత్త అమిత్

0

నల్గొండ లో బీఆర్ఎస్ బిగ్ షాక్….

== బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన గుత్త అమిత్

(నల్గొండ -విజయం న్యూస్)

పార్లమెంట్ ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది‌. ఇప్పటికే పార్టీ నుంచి వందలాది మంది కార్యకర్తలు పార్టీని వీడుతుండగా నాయకులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు.  అందులో భాగంగానే నల్గొండ జిల్లా కు చెందిన మరో కీలక నేత పార్టీని వీడారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇది కూడా చదవండి:- సాహస బాలుడ్ని అభినందించిన సీఎం రేవంత్

ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత కొంతకాలంగా అమిత్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడటంతో గుత్తా సుఖేందర్ కూడా కారు దిగడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఉహాగాణాలు వినిపిస్తున్నాయి.