Telugu News

బీఆర్ఎస్ అభ్యర్థి నామా నామినేషన్ 

టౌన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ

0

బీఆర్ఎస్ అభ్యర్థి నామా నామినేషన్ 

== టౌన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ

== సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ మంత్రి హరీష్ రావు 

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందించిన నామా నాగేశ్వరరావు, మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామా వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, మదన్ లాల్, కొండబాల కోటేశ్వరరావు హాజరైయ్యారు. కాగా నామా నాగేశ్వరరావు వరుసగా ఐదవ సారి ఖమ్మం పార్లమెంట్ కు  పోటీ పడుతున్నారు.

ఇది కూడా చదవండి:- రైతులను మోసం చేసింది కాంగ్రెస్: నామా

2004 సం”లో టీడీపీ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేసిన నామా నాగేశ్వరరావు సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరి పై ఓటమి పాలయ్యారు.2009లో తిరిగి పోటీ చేయగా విజయం సాధించారు‌. 2014సం”లో మరోసారి పోటీ చేయగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2019 సంవత్సరంలో మరోసారి పోటీ చేయగా రేణుకా చౌదరి పై విజయం సాధించారు.

** సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న హరీష్

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.