Telugu News

ఈ ఎన్నికల్లో కారు..తుక్కు పెట్టడం ఖాయం: పొంగులేటి

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు షెడ్ లో తుక్కుపట్టడం ఖాయం

0

బీఆర్ఎస్ కారు..తుక్కు తుక్కే: పొంగులేటి

== ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు షెడ్ లో తుక్కుపట్టడం ఖాయం

== రఘురాం రెడ్డి కి భారీ విజయాన్ని అందిద్దాం
== అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి
==  కొత్తగూడెం నియోజకవర్గ సమావేశంలో మంత్రి పొంగులేటి

(కొత్తగూడెం-విజయం న్యూస్)

ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు తుక్కు తుక్కు కానుందని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజారిటీ అందిద్దామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
శనివారం రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఇది కూడా చదవండి:- రఘురాంరెడ్డి విజయమే లక్ష్యం: పొంగులేటి 

గతంలో బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మి వివిధ పార్టీల నుంచి బీ ఆర్ఎస్లో చేరి అక్కడ ఇమడలేక కాంగ్రెస్లో చేరిన వారందరికీ శిరస్సు వంచి ఆహ్వానం పలుకుతున్నా అని.. అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కాంగ్రెస్ అనుకూల ఫలితాలే.. లోక్ సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలకులకు గత పది సంవత్సరాల్లో ప్రజలు గుర్తు రాలేదని, వారి ప్రభుత్వం పడిపోయాకనే జనం ద్యాస మొదలైందా అని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే నైతికత బీఆర్ ఎస్ కు లేదని, కొత్త ప్రభుత్వాన్ని విమర్శించడానికి కనీసం సిగ్గుండాలి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతుందని..

ఇది కూడా చదవండి:- మీతో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా: రఘురాంరెడ్డి

గుణపాఠం తప్పదని తెలిపారు. మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే బీ జే పీ నీ నమ్మొద్దని అన్నారు. బీ ఆర్ఎస్, బీ జే పీ రెండూ ఒకటే అని విమర్శించారు.
*నన్ను ఆశీర్వదించండి..: రఘురాం రెడ్డి*
ప్రజా సేవ కోసం, సోనియమ్మ పిలుపుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని.. ప్రజలంతా ఆశీర్వదించాలని కాంగ్రెస్ లోక్ సభ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి అన్నారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* ఎన్నికల సమన్వయ కర్త తుళ్లూరి బ్రహ్మయ్య, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, తోట దేవి ప్రసన్న, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, సీ పీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య,సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీ పీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేది, పెద్దబాబు, చీకటి కార్తీక్, ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ, ఐ ఎన్ టీ యు సీ నాయకులు త్యాగరాజన్, ఆల్బర్ట్, ఎండీ.రజాక్, విప్లవ రెడ్డి, టీజేఎస్ నాయకులు రామనాథం, సుందర్లాల్, కోరిస్ బాల ప్రసాద్, వెంకటేష్ రియాజ్ , అహ్మద్, కనకరాజు అమ్ములు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు..