బీఆర్ఎస్ గా పార్టీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం
** తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన పార్టీ కార్యవర్గం
** జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం
(హైదరాబాద్ -విజయం న్యూస్)
జాతీయ పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం ఆమోదించింది.. బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విధివిధానాలను కార్యవర్గానికి వివరించారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత్ రాష్ట్ర సమితి గా మారుస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో సీఎంకు అభినందనలు తెలిపారు. కార్యవర్గ సమావేశంలో జై బీఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు.
ఇది కూడా చదవండి – ఒక తీపి.. ఒక సేదు.. నేటితో టీఆర్ఎస్ కు పుల్ స్టాఫ్