Telugu News

బండిసంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్

రాస్తారోకోలు.. ధర్నాలు.. దిష్టిబొమ్మ దగ్ధాలు

0

బండిసంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్

== కవితమ్మ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు భగ్గుమన్న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు

== రాస్తారోకోలు.. ధర్నాలు.. దిష్టిబొమ్మ దగ్ధాలు

== బండి సంజయ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ల్ ఫిర్యాదు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనిచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు.  బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. నిరసన, రాస్తోరోకోలు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పిలుపుతో ఖమ్మం నియోజవర్గంలో పెద్ద ఎత్తున బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేసిన మహిళా కార్పొరేటర్, మహిళా సోదరీమణులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పిలుపుతో సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు, మహిళా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బండి సంజయ్ దిష్టిబొమ్మ ను చెప్పులతో కూడుతూ నిరసనను తెలిపారు.  ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గం లో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉండి బండి సంజయ్ ఒక  ఉన్నతమైన పదవిలో కొనసాగుతూ తెలంగాణ కీర్తిని ప్రపంచ నలుమూలలో చాటిన మహిళపై చేసిన అనిచిత వ్యాఖ్యలతో బిజెపి పార్టీకి, మహిళా లపై ఉన్న గౌరవం ఏమిటో అర్థం అవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలపై అత్యధికంగా ఎందుకు దాడులు జరుగుతున్నాయో బండి సంజయ్ వ్యాఖ్యలతో అర్థమవుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?

బండి సంజయ్ చేసిన ఈ వాక్యాలను మహిళా లోకమంతా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని తెలుపుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై ఒక మహిళగా స్పందించి చర్యలు తీసుకోవాలని, ఒక పార్టీకి అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ కొనసాగే అర్హత లేదంటూ డిమాండ్ చేస్తూ వెంటనే బండి సంజయ్ ని అరెస్టు చేయాలని ఖమ్మం జిల్లా మహిళా సోదరీమణులు కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల మహిళ సోదరీమణులు, బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.