Telugu News

ఖమ్మంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

0
ఖమ్మంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
== జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 
(ఖమ్మం-విజయం న్యూస్)
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ గ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిలుగా హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కొండబాల కోటేశ్వర రావు, తదితరులు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పార్టీ జెండాను ఎగరవేశారు. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్నికి నాయకులు, శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు.