కరకగూడెం లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్..
*👉బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..*
*👉కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పాయం వెంకటేశ్వర్లు..*
(పినపాక-విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, పద్మాపురం, అనంతారం,మొగిలితోగు గ్రామాలకి చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో,మాజీ ఎమ్మెల్యే *పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.. ఈ సందర్భంగా *పాయం వెంకటేశ్వర్లు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..
ఇది కూడా చదవండి:- ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!
అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి వారు మాట్లాడుతూ,
👉రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..
👉స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని విమర్శించారు..
👉తెలంగాణ ప్రభుత్వం ఉచిత హామీలు అని చెప్పి గద్దకెక్కిన కెసిఆర్ అన్ని కులాలను విస్మరించి కులానికి ఒక పథకం పేరు చెప్తూ కులాలను విభజించి పాలించారని అన్నారు..
👉బిఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన నచ్చక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలకు, డిక్లరేషన్లకు ఆకర్షితులై,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ఈరోజు కార్యకర్తలు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారన్నారు..
ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్
👉అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను, మరియు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లలో ప్రవేశపెట్టిన పథకాలను క్లుప్తంగా వివరించారు..
👉కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనీ అన్నారు..
👉ప్రతి పేదవాడి గుండెల్లో హస్తం గుర్తు నిలిచిపోయిందని, దానిని తుడిచి పెట్టడం ఎవరికి సాధ్యం కాదని పేర్కొన్నారు..
👉అలాగే నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తామని హామీ ఇచ్చారు..
*ఈ కార్యక్రమంలో*
ఇది కూడా చదవండి:- మాట ఇస్తున్నా…. తప్పేది లేదు: పొంగులేటి
మండల నాయకులు నాగ బండి వెంకటేశ్వర్లు, ఎర్ర సురేష్, చందా నాగేశ్వరరావు, కునసోత్ సాగర్,షేక్ రఫీ, జలగం కృష్ణ, భూక్యరాందాస్, దంచనాల రాజేంద్రప్రసాద్, కోరగట్ల విశ్వనాథం, పడిగా సమ్మయ్య, కోరగట్ల నరేందర్, కొంచెం వీరన్న, పడిగా అశోక్, గాంధర్ల రామనాథం, గోగ్గలి రవి,గొగ్గలి నరసింహారావు, ఎండి హకీమ్,అత్యాసారయ్య, మోకాల పాపారావు, అరె నరసింహారావు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…