Telugu News

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: నామా

ఆత్మీయ సమ్మెళనంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

0

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: నామా

== అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం

== మనసున్న నాయకుడు కేసీఆర్ కు అండగా ఉండాలి

==  మూడోసారి కేసీఆరే సీఎం

==  అంతా కలసి మెలసి పని చేయాలి

==  తెలంగాణా పై కేంద్రం కక్ష.. కుట్రలు

== 75 ఏళ్ళలో జరగని  అభివృద్ధి కేవలం 9 ఏళ్ళలోనే

== సీతారాం ప్రాజెక్ట్ తో అంతా సస్యశ్యామలం

== ఆత్మీయ సమ్మెళనంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

==  టేకులపల్లి ఎర్రటి ఎండలో భారీ ర్యాలీ

(ఇల్లెందు/టేకులపల్లి-విజయంన్యూస్):

  గొప్ప మనసున్న మన నాయకుడు కేసీఆర్ గారు..ఆయనకు అండగా ఉందాం.. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు గెల్చుకొని కేసీఆర్ కు  కానుకగా ఇద్దామని బీఆర్ఎస్  లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి లో ఆదివారం జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో నామ మాట్లాడారు. వచ్చేది మన ప్రభుత్వమే.. అందులో డౌటే లేదు..మూడోసారి కేసీఆరే  సీఎం అన్నారు.

ఇది కూడా చదవండి: అన్నింటా తెలంగాణ పట్ల కేంద్రం వివక్షే: నామా

అన్నదమ్ముల మద్యే గోడవలుంటాయని, అంతా సర్దుకుపోయి కలసి మెలసి ఐక్యంగా పని చేయాలన్నారు. ఒక్క ఇల్లందు నియోజకవర్గంలోనే రూ.1600 కోట్ల అభివృద్ది జరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణా అభివృద్ధి లో నెంబర్ వన్ గా ఉందన్నారు. పుష్కలంగా తాగు, సాగు నీటి అభివృద్ధి జరిగిందని, సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందని, అన్నీ ప్రాంతాలు పుష్కలమైన పంట దిగుబడులతో విలసిల్లుతాయని పేర్కొన్నారు.75 ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని కేసీఆర్  కేవలం 9 ఏళ్ళలోనే చేసి చూపించిన ఘనుడని పేర్కొన్నారు. గతంలో కరెంట్ , సాగు, తాగు నీటి కోసం సబ్ స్టేషన్లు ఊళ్ళల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసే వాళ్ళని, కానీ నేడు ఆ పరిస్థితి నంతా కేసీఆర్  మార్చివేశారని చెప్పారు.తెలంగాణా బిడ్డలు , పల్లెలు బాగుండాలని అన్ని విధాలా అభివృద్ధి చేశారని తెలిపారు. గతంలో పనుల కోసం  మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు పెద్ద ఎత్తున వలసపోయేవారని, కానీ నేడు కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్ల బయటి ప్రాంతాలకు చెందిన 20 లక్షల మందికి పైగా తెలంగాణాకు వచ్చి, వివిధ పనులు చేసుకుంటూ బతుకుతున్నారని  పేర్కొన్నారు.  తెలంగాణా అభివృద్ధి ని చూసి ఓర్వలేని కేంద్రం అడ్డంకులు సృష్టిస్తూ తెలంగాణా ను ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా మొండికేసిందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటు లో పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు.

ఇదికూడా చదవండి: కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?

బయ్యారంలో పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ ఉందని, తాను ఎన్నోసార్లు బయ్యారం వెళ్లి, చూడడం జరిగిందన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణా కు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా వివక్ష చూపించిందని మండిపడ్డారు. మొండి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించి, ఇంటికి పంపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నామ నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ , దిండిగాల రాజేందర్, వరప్రసాద్, సైదులు నాయక్,వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావులక్కినేని శ్యామ్ , చీమల సత్యనారాయణ, అప్పారావు, లాల్ సింగ్ , శ్రీనివాసరావు, కంభంపాటి వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ రావు , నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు , కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

== భారీ ర్యాలీ లో నామ

  ఈ సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీలో ఎంపీ నామ నాగేశ్వరరావు  , ఎమ్మెల్యే హరిప్రియ ,స్థానిక నాయకత్వం పాల్గొన్నది. ర్యాలీలో నామ ఆకర్షణగా నిలిచారు. భగ్గున మండుతున్న ఎండలో టేకులపల్లి వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నామ నాగేశ్వరరావు  ర్యాలీలో పాల్గొన్నారు.