Telugu News

బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు: భట్టి

చిన్న ఉమ్మెత్తల కార్నర్ మీటింగ్లో భట్టి విక్రమార్క వెల్లడి

0

బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు: భట్టి

== బిఆర్ఎస్ పాలకులను ఊరూరా నిలదీయండి

== ధరలు పెంచి పేదల రక్తాన్ని పీల్చుకు తింటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

== ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే ప్రజల ప్రభుత్వం

== చిన్న ఉమ్మెత్తల కార్నర్ మీటింగ్లో భట్టి విక్రమార్క వెల్లడి

 (కొందుర్గ/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవి పల్లి కాలువ నిర్మాణం చేయకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 59వ రోజు ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గం, కుందుర్గు మండలం, చిన్న ఉమ్మెత్తల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్

 మీటింగ్లో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డిజైన్ చేయగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట రీడిజైన్

 చేసి ప్రాణహిత ప్రాణం తీసింది అని అన్నారు.

ఇది కూడా చదవండి: సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం  చేయడానికి సాగు నీరు అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం 10 ఏండ్లు  కావస్తున్న చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవి పల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం అదే మాట మీద నిలబడాలని ఓట్లు అడిగే అర్హత  లేదని అన్నారు. నీళ్లు ఇవ్వకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ పాలకులను గ్రామాల్లో తిరుగనివ్వొద్దనిఅడుగడుగున నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ లక్ష్యాన్ని  బిఆర్ఎస్  ప్రభుత్వం నెరవేర్చనందునే తాను పాదయాత్ర చేయాల్సి వస్తుందని వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయలను గోదావరిలో పోసి సముద్రం పాలు చేసిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ పెద్దలు, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోపిడీ చేయడమే కాకుండా అభివృద్ధి పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రైతుబంధు ఇస్తున్నామన్న పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల ధరలు మూడింతలు పెంచి, డీజిల్ పై పన్నులు విధించి రైతులపై ఎకరాకు 12 వేల పైగా భారం వేస్తున్నదని వివరించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: భట్టి విక్రమార్క

ఏకకాలంలో రైతులకు రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల రైతులు తీసుకున్న రుణాల వడ్డీ పెరిగి, అసలు వడ్డీ కలిపి మూడు లక్షల రూపాయల వరకు అయ్యిందని, ఈ ప్రభుత్వం రైతులకు ఏమి మేలు చేసిందని నిలదీశారు. దొరల ప్రభుత్వంలో  తెలంగాణ ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను ఆకాశానికి పెంచేసి పేదల రక్తాలను పీల్చుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వేల పింఛన్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులను తెరిచి తాగండి…

తాగండి అంటూ మద్యం అమ్మకాలు పెంచుకొని పేదల నుంచి నెలకు 6 నుంచి పది వేల రూపాయల వరకు దండుకొని 2వేల రూపాయలు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తిండి, ఇండ్లు లేనటువంటి వారు ఉండటానికి వీలు లేదన్న లక్ష్యాన్ని పెట్టుకొని పని చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే

అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడంతో పాటు ఇల్లు లేనటువంటి పేదలకు ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.  పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లో కేజీ నుంచి పేజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలు రూపాయలు వెసలబాటు కల్పిస్తామని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని, కూలీలకు కూలి బందు పథకం తీసుకొచ్చి ఏడాదికి 12,000 వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రభుత్వం రావాలంటే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.