Telugu News

బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా.

0
బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
== తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా.
== ఇచ్చిన మాటను బీఆర్ఎస్‌ నిలబెట్టుకుంది.
== పేదలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం.
== కేసీఆర్‌కు అండగా నిలవాలి.
== సాకారమైన పేదల సొంతింటి కల.
== నియోజకవర్గ వ్యాప్తంగా మూడువేల మందికి అందనున్న గృహలక్ష్మి పథకం.
== గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణి షురూ
== పండుగ వాతావరణం లొ గృహలక్ష్మి మంజూరు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని..చేతుల ప్రభుత్వమని, చెప్పిందళ్ళా చేసి చూపించడంతో పాటు, చెప్పిన సంక్షేమాభివృద్ది పథకాలను సైతం చేసి చూపించే ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి:-చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు..

పేద, సామాన్య ప్రజలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కొన్నారు.  గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పత్రాలను గురువారం భక్త రామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ పత్రాల పంపిణి చేశారు.అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలనెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు మన సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ గారి ఆకాంక్ష అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింప జేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహలక్ష్మి పథకమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతా: మంత్రి

గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని తెలిపారు. తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌  లక్ష్యం  అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం గా ఉందని, బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.మళ్ళీ ఇలాంటి పథకాలు మనకు పూర్తి స్థాయిలో అందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డెప్యూటీ మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్ లు దాదే అమృతమ్మ సతీష్, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు,

ఇది కూడా చదవండి:- తుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ

పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, మడురి ప్రసాద్, బుర్రి వెంకట్ కుమార్,  మాటేటి అరుణ, పసుమర్తి రాం మోహన్, బుడిగం శ్రీను, మాజీ కార్పొరేటర్ కు తోట రామారావు, మాటేటి నాగేశ్వర రావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్ కుమార్, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.