Telugu News

మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు: రవిచంద్ర

బీఆర్ఎస్ ప్రజల పార్టీ.. తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే

0

మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు: రవిచంద్ర

== బీఆర్ఎస్ ప్రజల పార్టీ.. తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే

==  జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించనున్నరు

== కేసీఆర్,కవితల కృషి వల్లే మహిళా బిల్లుకు ఆమోదం లభించింది

== గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ రవిచంద్ర

== వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ చేరిక

(ఇల్లందు-విజయంన్యూస్)

ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చే దొంగలు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు హితవు పలికారు.ప్రజల కష్టనష్టాల గురించి ఎన్నడూ కూడా ఆలోచించని,పట్టించుకోని నాయకులు తమ రంగులు మార్చి వస్తున్నారని, అటువంటి వారి మాటలు విని మోసపోవద్దన్నారు.ఇతర పార్టీల మాదిరిగా బీఆర్ఎస్ మాటలు చెప్పమని,హామీలు ఇవ్వమని, మేనిఫెస్టోలో పెట్టినవి,పెట్టని వాటిని కూడా అమలు చేసి చేతల్లో చూపుతమన్నారు.బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని,తమ పార్టీ నాయకులు ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటరని, తిరిగి అధికారంలోకి వచ్చేది కూడా తామేనన్నారు.మహానేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని,

ఇది కూడా చదవండి: అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర

తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తారని ఎంపీ రవిచంద్ర వివరించారు.బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జి అయిన ఎంపీ వద్దిరాజు గార్ల మండల కేంద్రం శుక్రవారం జరిగిన సభలో గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితల కృషి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఇందుకు కోసం అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని గుర్తు చేశారు.అలాగే, జంతర్ మంతర్ వద్ద కవిత ఆందోళన చేసి 18పార్టీల మద్దతు కూడగట్టారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను కేసీఆర్ పరిష్కరించి వారికి న్యాయం చేశారని, ఆత్మగౌరవాన్ని మరింత పెంచారని చెప్పారు.ఇల్లందుకు త్వరలో వంద పడకల ఆస్పత్రి రానున్నదని, రాంపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆయన వెల్లడించారు.నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన, చేస్తున్న హరిప్రియను మనమందరం కలిసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర సమక్షంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు, గులాబీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే హరిప్రియలను బీఆర్ఎస్ శ్రేణులు భారీ గజమాల వేసి,శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు,ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, ఆకుతోట ఆదినారాయణ,వేం రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు

ఇది కూడా చదవండి: జోస్యం చెప్పిన నామ..ఏమన్నరంటే..?