Telugu News

బీఆర్ఎస్ నేతల్లారా ఖబర్దార్ : భట్టి విక్రమార్క

అధికారం ఉందికదా అని అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే ఊరుకునేదే లేదు

0

బీఆర్ఎస్ నేతల్లారా ఖబర్దార్ : భట్టి విక్రమార్క

== అధికారం ఉందికదా అని అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే ఊరుకునేదే లేదు

== దమ్ముంటే ఎమ్మెల్యే కందాళ రాజీనామా చేయాలి

== పాలేరు ప్రజలు మేలుకోవాలి..మోసం చేసినోళ్లను తరిమికొట్టాలి

== పోలీసులు ప్రజస్వామ్యాన్ని కాపాడాలి

== అధికారంలో ఉన్నోళ్లు చెప్పనట్లు తల ఊపి కేసులు పెడితే మూల్యం చెల్లిస్తారు

== వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..ఎవరు భయపడోద్దు

== జీళ్ళచెరువు కార్నర్ మీటింగ్ లో గర్జించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== జీళ్ళచెరువులో జనసందోహం..భట్టికి అడుగడుగున నిరాజనం

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలో, ముఖ్యంగా కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ నాయకులు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్.. మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. మీ సంగతి చూసేందుకు ప్రజానికం సిద్దంగా ఉంది. పోలీసులు అధికార పార్టీ నేతలతో జతకలిసి, తమ విధులను మరిచి పార్టీ కార్యకర్తలకంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతల మాయలో పడి అక్రమ కేసులు బనాయిస్తు కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్లకు  రాజద్రోహులను అరెస్ట్ చేసినట్లుగా అర్థరాత్రి ఇండ్లపైకి వెళ్తున్నారు. మహిళలను వేదిస్తున్నారు. ఇక చాలు ఆపకపోతే పోలీసుల సంగతేంటో కూడా ప్రజలే చూసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ ద్రోహి కందాళ: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేవ్వరు ఆదైర్యపడోద్దని, ఎవరు భయపడోద్దని, మరో ఆరు నెలల్లో అధికారం మనదేనని, మీ అందరికి అండగా ఉంటానని సీఎల్పీనేత భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. అదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామం నుంచి ప్రారంభమైన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలంకు చేరుకోగా 105 రోజు జీళ్ళచెరువు గ్రామానికి చేరుకుంది. దీంతో జీళ్ళచెరువు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం పలికారు. వేలాధి మంది కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు. జనసంద్రం నడుమ పాదయాత్ర కొనసాగింది.. మహిళలు

హరతులిచ్చి, తిలకం దిద్ది భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికారు. ఆశీర్వదించారు. ఇక యువత డ్యాన్సులతో సందడి చేశారు. జై భట్టి..జైజై భట్టి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరేత్తించారు. ఈ సందర్భంగా జీళ్ళచెరువు సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను బెదిరింపులకు దిగుతున్నారని, వారికి భరోసానివాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మండలంలో, గ్రామంలో అక్రమాల పుట్ట రోజురోజుకు పెరిగిపోతుందని, ఆ విషయం  సమయం వచ్చినప్పుడు కచ్చితంగా లెక్కలతో సహా ప్రజలకు వివరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామన్నారు. ఆశేష జనం హాజరై భట్టి విక్రమార్కకు స్వాగతం పలికన జీళ్ళచెరువు ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కోట్లాడి, కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రజా సమస్యలను గాలికోదిలేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, రాష్ట్ర ప్రజాసంపద కేసీఆర్ ఇంటి సంపదగా మారిపోయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ మూడు తప్ప అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నాగార్జున సాగర్, శ్రీశైలంలాంటి మహోన్నత ప్రాజెక్టులను నిర్మాణం చేసి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కాదు కదా కాలువల్లో పూడికలు కూడా తీయలేకపోతుందన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో సీఎల్పీ నేతకు ప్రజల అభిమాన వర్షం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అద్భుతమైన ప్రాజక్టులను నిర్మాణం చేసి మరింత వ్యవసాయ భూమికి సాగునీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో లక్షలాధి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి లక్షలాధి మంది నిరుద్యోగులకు, యువతి, యువకులకు ఉద్యోగాలను కల్పించామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వంహాయంలో పట్టుమని 100 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ గడిచిన ప్రభుత్వంహాయంలో ఐదు సార్లు డీఎస్పీ, మూడు సార్లు పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వేలాధి మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. బీఆర్ఎస్ 10ఏళ్ల పరిపాలన ఒక్కటంటే ఒక్క డీఎస్సీ వేయలేదని, నిరుద్యోగులు రోడ్ల వెంట తిరుగాల్సిన దుస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి పోస్టులను భర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు రూ3.వేల చొప్పున నిరుద్యోగ భ్రుతిని అందిస్తామన్నారు. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్రానికి బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికి ప్రతి పంచాయతీలకు భారీగా నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీల అభివద్దికి ప్రయత్నం చేశామన్నారు. కానీ నేడు గ్రామాల అభివద్దిని వదిలేసి కేసీఆర్ కుటుంబ అభివద్ది కోసం ప్రయత్నం చేస్తున్నారని, గ్రామస్థాయిలో బీఆర్ఎస్ నేతల అభివద్ది కోసం నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి సంపద గుంటలను కూడా వదలకుండా తవ్వేసి అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా అవినీతి అక్రమాలు చేసిన బీఆర్ఎస్ నేతల సంగతేంటో చూస్తామన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం  కాంగ్రెస్ పార్టీ ఓ చట్టాన్ని తీసుకోస్తామని, అవినీతిరహిత పాలనను అందిస్తామన్నారు.

== హామిల వర్షం కురిపించిన భట్టి

వేల కొట్ల రూపాయల ఆదాయంతో కూడాని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తే, సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని, అవసరమైన పథకాలను వదిలేసి అడ్డగోలుగా సంపాధించే పథకాలను అమలు చేస్తూ రాబోయే ఎన్నికలకు ఖర్చు చేసి ప్రజలను గొర్రెళ్లా మార్చేసి కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందే విధంగా, ప్రభుత్వ ఫలాలను పేదల అనుభవించే విధంగా చూసిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ జనగర్జన సభను జయప్రదం చేయండి: ఠాక్రే

కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని, ప్రజ సమస్యలను గాలికోదిలేశారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ ప్రజలకు అందిస్తామన్నారు. కేంద్రరాష్ట్రప్రభుత్వాలు చేతులు కలిపి ప్రజలపై భారం మోపుతున్నాయని, ఏ వస్తువును చూసిన ధరలతో మండిపోతున్నాయని ఆరోపించారు. ధరల పై నియంత్రణ లేదన్నారు.కాంగ్రెస్ హాయంలో రూ.40 ఉన్న పెట్రోలు ఈ రోజు 100 దాటిందని, రూ.45 ఉన్న నూనే ప్యాకెట్ రూ.100 దాటిందని అన్నారు. పేద ప్రజలు ఏవిధంగా బతకాలో మీరే అర్థం చేసుకోవాలన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి, అన్ని వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. వంట గ్యాస్ రూ.450 నుంచి రూ.1150కి పెరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ ను ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకంటే ముందు రూ.1లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే సారి రూ2.లక్షలను రుణమాఫీ చేస్తామన్నారు. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న ధరణి పథకాన్ని బంగాళాఖాతంలో వేస్తామని, రైతులకు మేలు చేసే మంచి పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్నో అద్భుత పథకాలను ప్రజలకు అందించి ప్రజాస్వామ పద్దతిలో పరిపాలన కొనసాగిస్తామన్నారు.

== ఎమ్మెల్యే దమ్ముంటే రాజీనామా చేయ్

పాలేరు నియోజకవర్గ ప్రజలు కష్టపడి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే, ప్రజలకు చెప్పకుండా ధనార్జన కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి ప్రజల ఆశయాలను నట్టేటా ముంచిన పాలేరు నియోజకవర్గ ద్రోహి అని, ఆయన దమ్ముంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందించిన పదవిలో ఉంటూ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా..? సహించేదేలేదన్నారు.దేవుడి విషయంలో రాజకీయం చేసి గొడవను స్రుష్టించి మండల స్థాయి నాయకులపై అక్రమ కేసులు పెట్టి క్యాంఫ్ ఆపీసుల్లో కండువలు కప్పుతారా..? మీకు సిగ్గుందా..? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: జులై 2 న ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ సభ

నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే వదిలేది లేదని, మీ డ్రామాలను ప్రజలందరు గమనిస్తున్నారని, సమయం కోసం చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటేసి మీ సంగతి చూస్తారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని హామినిచ్చారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేసుకోవాలే తప్ప, రాజకీయం పేరుతో పోలీసులను అడ్డంగా పెట్టుకుని అక్రమ కేసులు పెట్టాలని చూస్తే మా సత్తా ఏంటో కూడా చూపిస్తామన్నారు. కార్యకర్తలు ఎవరు భయపడోద్దన్నారు. ఆరు నెలల్లో కచ్చితంగా ప్రభుత్వం మనదే వస్తుందని, అదైర్యపడకుండా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకరావాలని కోరారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని, మనల్ని మోసం చేసి స్వలాభం కోసం పార్టీ మారి మీ ఓటును కేసీఆర్ కు అమ్మేసిన నాయకులను పాలేరు నియోజకవర్గం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, రాందాసు నాయక్, పుచ్చకాయల వీరభద్రం, ఎస్సీసెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, యువ నాయకులు రాంరెడ్డి చరణ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య, జిల్లా నాయకులు ఎండీ.హాఫీజుద్దీన్, పెండ్ర అంజయ్య, బానోతు వినోదా, బెల్లంకొండ శరత్ గౌడ్, నాగిరెడ్డి రమేష్ రెడ్డి,బొంగా నాయక్, మంచానాయక్, బాసునాయక్, బానోతు హరినాథ్, బొల్లికొండ శ్రీనివాస్,బెల్లంకొండ కిరణ్ కుమార్ గౌడ్, మద్దెల ఉపేందర్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు, బీసీసెల్ అధ్యక్షుడు మునుగంటి రాములు, కిసాన్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మాదవ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లచ్చునాయక్, యువజనకాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఐతగాని ప్రభాకర్, గ్రామ శాఖఅధ్యక్షుడు కత్తి శ్యామ్, వార్డు సభ్యుడు ఐతగాని రంగయ్య, ఐతగాని నాగేశ్వరరావు, కాసాని వెంకన్న,ఐతగాని రంగయ్య, గుమ్మడెల్లి నరేష్, కొండా ప్రసాద్, తమ్మరబోయిన లక్ష్మయ్య, దంతాల శ్రీను, మొక్క ఉపేందర్, టీడీపీ పార్టీ నుంచి గ్రామశాఖ అధ్యక్షుడు పెండ్ర రమేష్, ఐతగాని భూషయ్య, గోపి శంకర్, గోపి రవి తదితరులు హాజరైయ్యారు.