Telugu News

బీఆర్ఎస్ పార్టీ గెలుపె ధ్యేయంగా పనిచేయాలి: మదన్ లాల్

వైరా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్

0
బీఆర్ఎస్ పార్టీ గెలుపె ధ్యేయంగా పనిచేయాలి
== *కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి*
వైరా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్
(వైరా-విజయంన్యూస్)
వైరా మండలం రెబ్బవరం గ్రామంలో మదన్ లాల్ ఆదివారం పర్యటించారు. చర్చిలో జరుగుతున్న ప్రార్థనా కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మదర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి సన్మానించారు.ఆకుల రాజు ఏర్పాటు చేసిన ఈ ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్నా మదన్ లాల్ మేరీమాత విగ్రహాలకు పూల మలేసి పూజించారు .అనంతరం గ్రామ సర్పంచ్ సాధం రామారావు ఇంటి వద్ద జరిగిన తేనేటి కార్యక్రమంలో బానోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధాం రామారావు కుటుంబ సభ్యులతో మదన్ లాల్ కు స్వాగతం పలికారు. అనంతరం సాదం రామారావు ఇంట్లో మదన్ లాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కలిసికట్టుగా ఉండి పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి అని అన్నారు.,.ఈ కార్యక్రమంలో వైరా మండల బుఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సాధం రామారావు, ఆకుల రాజు ,మెండెం కృష్ణంరాజు ,కొత్తా వెంకటేశ్వరావు, మాదినేని దుర్గాప్రసాద్ ,డాక్టర్ పెరుమల్ల కృష్ణామూర్తి ,వైరా సొసైటీ డైరెక్టర్ దొంతేబొయన వెంకటేశ్వర్లు, కిలారి శ్రీనివాసరావు, వనమా చిన్ని ,మేదరమెట్ల రాము, దొంతబోయిన వెంకట్ నారాయణ ,కోసూరు రామకృష్ణ ,వేల్పుల నారాయణ, సింగవరపు నరేష్ రెబ్బవరం గ్రామ శాఖ అధ్యక్షుడు కామ సురేష్ ,సరిపూడి కోటేశ్వరావు, యండ్రాతి గోపాలరావు, ఏలూరు నరసింహారావు పలువురు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు