Telugu News

బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

0

బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

== సస్సెన్షన్ ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్ 

(ఖమ్మం/ హైదరాబాద్‌-విజయం న్యూస్)

బీఅర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది..

Allso read:- సీఎం కథేందో..? మీ చరిత్రేందో..? రేపు చెబుతా: పొంగులేటి

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. డిసెంబర్, 2022 వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన పొంగులేటి,జూపల్లి కృష్ణారావు 2023 జనవరి 1నుంచి బీఆర్ఎస్ కు యాంటీగా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ కు‌ వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం ప్రభుత్వం పై విమ్మర్శలు చేయడం కొనసాగింది. ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేయడం అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సుమారు 4నెలల పాటు ఓపిక పట్టిన బీఆర్ఎస్ అధిష్టానం కొత్తగూడెం నియోజకవర్గం లో ఆత్మీయ సమ్మేళనం జరిగిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది

Allso read:- కేసీఆర్ పార్టీ గెలుచుడే ఉండది:పొంగులేటి