Telugu News

‘బీఆర్ఎస్’ పుల్ జోష్.. సీఎం ఖుషి

భారీగా జనం రాకతో సీఎం కేసీఆర్ ముఖంలో ఆనందం

0

‘బీఆర్ఎస్’ పుల్ జోష్

== సూపర్ సక్సెస్ అయిన బహిరంగ సభ

== భారీగా తరలివచ్చిన జనం

== రోడ్లన్ని బ్లాక్.. పుల్ ట్రాఫిక్ జామ్

== చేతులేత్తేసిన పోలీసులు

== భారీగా జనం రాకతో సీఎం కేసీఆర్ ముఖంలో ఆనందం

== మంత్రులు హరీష్ రావు, పువ్వాడను అభినందించిన సీఎం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పుల్ జోష్ లో ఉన్నారు.. సీఎం కేసీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభను  బీఆర్ఎస్ నేతలు సూపర్ సక్సెస్ చేశారు.. భారీ జన సమీకరణ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు.. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా జనం తరలిరావడంతో 100 ఎకరాల బహిరంగ సభ స్థలం జనంతో కిక్కిరిసిపోయింది. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 250 ఎకరాల పార్కింగ్ స్థలం నిండిపోయింది.. రోడ్లన్ని బ్లాక్ అయ్యాయి.. పుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. ఎక్కడ చూసిన వాహనాలు.. వందలాధి మంది పోలీసులు ఏం చేయాలేకపోయారు. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు నుంచి కోణిజర్ల వరకు ఖమ్మం-కొత్తగూడెం రోడ్డు వాహనాలతో నిండిపోయింది.. పార్కింగ్ స్థలం సరిపోక రోడ్లపైనే వాహనాలు నిండిపోయాయి.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో రెండవ విడుత కంటి వెలుగు షురూ..

పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను రూట్ మార్చారు. దీంతో కొంత ఒత్తిడి తగ్గినప్పటికి అక్కడికి వచ్చిన జనంతో, పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక ఒకానోక దశలో చేతిలేత్తేసినట్లే కనిపించింది. ఇక సభా ప్రాంగణంలో వచ్చిన జనంను కుర్చోబెట్టేందుకు 1000 మంది వాలంటీర్లు పనిచేసిన జనం ఒత్తిడికి ఏం చేయాలో అర్థంకాలేదు. పదేపదే కేరింతలు, పోలీసులు నచ్చజెప్పిన వినలేదు. సభాప్రాంగణం దద్దరిల్లిందనే చెప్పాలి. సుమారు 2లక్షల మంది జనం తరలివచ్చినట్లు భావిస్తున్నారు.

== టెన్షన్ పడిన నాయకత్వం

సీఎం కేసీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మక సభ.. జాతీయ రాజకీయాలకు అడుగిడిన సీఎం కేసీఆర్ కు పార్టీ పేరు మార్పు అనంతరం నిర్వహించే తొలి బహిరంగ సభ  కావడంతో చాలా ప్రతిష్టాత్మకమైన సభ.. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ నాయకులు హాజరైయ్యే ఈ సభకు భారీ జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. అందకు గాను గత 20 రోజుల నుంచి యుద్దం షూరు చేశారు. ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్న బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ సభను ఖమ్మంకు మార్చుకున్నారు… అయితే అప్పటికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిక్కారస్వరం.

ఇది కూడా చదవండి: ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంలు

ఆయనతో చాలా నాయకత్వం, కార్యవర్గం, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయిన పరిస్థితి.. తుమ్మల నాగేశ్వరరావు దిక్కార స్వరం, మాజీ ఎమ్మెల్యేలు అంతులేకుండా ఉన్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించడంతో స్థానిక ఖమ్మం జిల్లా నేతలకు టెన్షన్ పడ్డారు. అయితే సీఎం కేసీఆర్ చాలా వ్యూహత్మకంగా అడుగలేశారు. ఉన్నఫలంగా జిల్లా ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. నిశబ్ధంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును లైన్లోకి తీసుకున్నారు. డబుల్ షూటర్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారు.. ప్రతి నియోజకవర్గంలో అత్యవసర సమావేశాలను నిర్వహించిన హరీష్ రావు, అసమ్మత్తిగా ఉన్న నేతలను సైతం కలిసి కలుపుకుని పోయేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు మినహా మిగిలన నేతలందరు హాజరైయ్యారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కూడా హాజరు కావడం బహిరంగ సభకు జనసమీకరణకు మరింతగా బలం చేకూరిందనే చెప్పాలి. అయితే 5లక్షల జన సమీకరణే లక్ష్యంగా షూరు చేసిన సన్నాహక సమావేశాలు అందుకు తగ్గట్లుగా జనసమీకరణకు ఏర్పాట్లు చేసినప్పటికి ఎక్కడ జనం తగ్గుతారేమోనని ముఖ్యనేతలు భయపడ్డారు.

== సీఎంలు వచ్చే వరకు నిండని గ్యాలరీ

ఖమ్మంలో బహిరంగకు భారీ జనసమీకరణ చేసినప్పటికి సీఎంలు ఖమ్మం వచ్చే వరకు సభా ప్రాంగణంలో జనం లేక ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. దీంతో నాయకులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనం వస్తారా..? అని భయపడినట్లుగా కనిపించింది. ఉన్న సీట్లలో జనాలను కుర్చోబెట్టేందుకు ముఖ్యమైన నాయకులు, డీఐజీలు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో జనం సభాప్రాంగణానికి రాలేకపోయాయినట్లు తరువాత తెలిసింది. రెండు హెలికాప్టర్ ఖమ్మం సభాప్రాంగాణానికి రావడంతో జనం ఒక్కసారిగా సభా ప్రాంగణానికి ఎగబడ్డారు. నిమిషాల వ్యవధిలోనే 100 ఎకరాల ప్రాగణం నిండిపోయి ఇసుకేస్తే రాలనంత జనంగా మారింది. దీంతో నాయకులు, పోలీసులు, అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. సభ అద్భుతంగా సక్సెస్ అయ్యింది..

ఇది కూడా చదవండి: దంచికొట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్ 

== మండుటెండల్లో మగ్గిన కార్యకర్తలు, నాయకులు

సభాప్రాంగణంలో టెండ్లు లేకపోవడం, భారీగా జనం రావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సభ కోసం వచ్చిన జనం, కార్యకర్తలు, నాయకులు ఎండలో మగ్గిపోయారు. ఉదయం 11గంటలకే గ్రౌండ్ కు వచ్చిన జనం ఎర్రటి ఎండలో కుర్చోవాల్సి వచ్చింది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిండు ఎండలోనే ఉండిపోయారు. అయితే నాయకులు వాటర్ సౌకర్యం కల్పించినప్పటికి ఎర్రటి ఎండకు ఇబ్బందులు పడుతూ నిర్వహాకులపై, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎర్రటి ఎండను తట్టుకోలేక మీటింగ్ అయిపోయేంత వరకు కూడా జనం లేరు. మధ్యలోనే చాలా మంది వెళ్లిపోయారు. అయితే సుమారు లక్షకు పైగా గ్రౌండ్లే సీఎం కేసీఆర్ మాట్లాడే వరకు వేచి చూశారు.