Telugu News

బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలాజీ

ఏన్కూరులో మండలం కోర్ కమిటీ సమావేశం

0

బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలాజీ

== ఏన్కూరులో మండలం కోర్ కమిటీ సమావేశం

ఏన్కూరు, నవంబర్ 2(విజయం న్యూస్):

బిఆర్ఎస్ వైరా అభ్యర్థి బానోత్ మదన్ లాల్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా దిశ కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో కోర్ కమిటీ, బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ సభకు భారీగా తరలిరాండీ..: మంత్రి పువ్వాడ

కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ నెల 4న వైరా బిఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ ఎన్నికల ప్రచారాన్ని నాచారం నుండి ప్రారంభిస్తారని ఈ కార్యక్రమాన్ని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, నాయకులు యండ్రాతి మోహన్ రావు, నామ వెంకయ్య, వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నం హరికృష్ణ, మాదినేని అశోక్, వేముల రమేష్, చీటి కోటేశ్వరరావు, ముదిగొండ నాగేశ్వరరావు, పూర్ణకంటి నాగరాజు, పిల్లలమర్రి రాంబాబు, ఏరువ నవీన్, పటాన్ జలాల్ ఖాన్, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో బీఆర్ఎస్ లోకి వలసలు జోరు..