Telugu News

46వ డివిజన్ లో బీఆర్ఎస్ ఖాళీ..

500కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

0

46వ డివిజన్ లో బీఆర్ఎస్ ఖాళీ..

== 500కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

== కండువా కప్పి స్వాగతం పలికిన జిల్లా, నగరం కమిటీ అధ్యక్షులు

(ఖమ్మం-విజయం న్యూస్)

ఖమ్మం నగరం 46 డివిజన్లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది.  ఖమ్మం నగర ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ డివిజన్ అద్యక్షుడు రజి ఆధ్వర్యంలో  కురుమ సంఘం, కుమ్మరి సంఘం, రజక సంఘం కుటుంబాలు బి ఆర్ ఎస్ కు మూకుమ్మడి. గా. రాజీనామా చేసి సుమారుగా 500 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. స్థానిక గాంధీచౌక్ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ మెంబర్ మొహమ్మద్ జావేద్,ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రం బాలగంగాధర్ తిలక్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన మీ అందరికీ సముచిత స్థానం ఉంటుందని అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తామని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించి భారీ మెజారిటీతో రఘురాం రెడ్డి ని గెలిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీ లను అమలు చేసి పేద ప్రజల కష్టాలు తీర్చింది అంతేకాకుండా ఇందిరామరాజ్యంతో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి నేతృత్వంలో ఖమ్మం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీలోనే పేదవారికి న్యాయం జరుగుతుందని భావించి ఈ పార్టీలోకి రావడం జరిగగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారి విజయంలో పాలు పంచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో 42 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ రజ్జి, కురుమ సంఘం అధ్యక్షులు దేవర వెంకన్న ప్రధాన కార్యదర్శి మాలిగా గౌరీ శంకర్ కోశాధికారి చిందం సైదులు మరియు సంఘ పెద్దలు కాటం కొమరయ్య, జెట్ట కృష్ణయ్య, మరాఠీ యాదయ్య, కాటం యాదయ్య, అచ్చిన వెంకన్న,మంగ యాదయ్య, మొటే నరసింహ, జెట్టా ఎల్లప్ప, మోటె పాపులు, మంగా వెంకన్న,కుమ్మర సంఘం అధ్యక్షులు శనిగరం ఉపేందర్ కార్యదర్శి సనిగరం రాములు, కోశాధికారి, ఉటుకురి ఆంజనేయులు గర్శకోటి నారాయణ,సత్యనారాయణ, వీరన్న,మల్లేశం ఓరుగంటి మల్లేశం ఉటుకురి బాల భిక్షం ,రాముల,మరియు రజక సంఘం గొనేల రవి శంకర్, బంధరపు విజయ, రాము మరియు డివిజన్ కాంగ్రెస్ నాయకులు దయ్యాల నాగేశ్వరరావు మరాటి బీరేష్ సూదగాని మల్లికార్జున్,తుపాకుల మధు రేగు రవీందర్ ఎమ్మే సత్యనారాయణ, రేగు చంద్రయ్య మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు