Telugu News

పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ

కందాళను కొనియాడిన మంత్రి పువ్వాడ

0

పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ

== కందాళను కొనియాడిన మంత్రి పువ్వాడ

== పాలేరు నియోజకర్గం అభివద్ది చెందింది సీఎం కేసీఆర్ వల్లనే

== పాలేరు మరింత అభివద్ది జరగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి

== పిండిప్రోలులో పలు అభివద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

== హాజరైన ఎంపీలు నామా, రవిచంద్ర, ఎమ్మెల్యే కందాళ, ఎమ్మె్ల్సీ తాతామధు

(కూసుమంచి,తిరుమలాయపాలెం-విజయంన్యూస్)

పాలేరు నియోకవర్గంలో మరోసారి కందాళ ఉపేందర్ రెడ్డి గెలవబోతున్నారని, రెండవ సారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోస్యం చెప్పారు.   పాలేరు నియోజకవర్గం పిండిప్రోలు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ కామెంట్స్..

ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ లోనే ‘పాలెం’ సమగ్రాభివృద్ధి: మంత్రి

తెలంగాణ ఏర్పడ్డ నాటికి మనకు ఉన్నది 7,770మెగా వాట్స్ విద్యుత్ మాత్రమే ఉండేది .. కానీ నేడు 18వేల మెగా వాట్స్ విద్యుత్ లభ్యతలో ఉన్నది. త్వరలో 25వేల మెగా వాట్స్ విద్యుత్ అందుబాటులోకి రానుంది.

ఇది మనం సాధించిన ప్రగతి.. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు brs. మాటలు చెప్తే విద్యుత్ రంగంలో ఇంతటి విప్లవాత్మక పురోగతి వస్తదా. అందుకు కేసీఅర్ గారు చాలా కష్టపడ్డారు.. పట్టుబట్టి సాధించారు.

రైతులకు 24గంటలు ఉచితంగా ఇస్తున్న BRS ప్రభుత్వం కావాలా.. కేవలం మూడు గంటలు చాలు అన్నా రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా.. తేల్చుకోవాలి.

ఆచరణ సాధ్యంకాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది.. రూ.4వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెన్షన్ ఎక్కడా కూడా రూ.వెయ్యి దాటలేదు.. కానీ తెలంగాణ లో మాత్రం రూ.4 వేలు ఇస్తారట. అది సాధ్యమయ్యే పనేనా.

ఇది కూడా చదవండి:  ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ

BRS ప్రభుత్వం సువర్ణ పాలన మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది.. కార్యకర్తలు సమాయత్తం కావలి. మనం మన BRS ను గెలిపించుకోలేక పోతే మనం చాలా ఇబ్బందులు పడతాం.

రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తలపెట్టిన అన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్నాం. సీతారామ ప్రాజెక్ట్ ఒక్కటే మిగిలింది.. ఇప్పటికే తలపెట్టిన అన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేసి రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నారు..

ఎవరికో ఒక్కరికి కడుపునొప్పి ఉందని మనకు ఉండాల్సిన పని లేదు. అది వాళ్ళ సొంత నొప్పి.. కొని తెచ్చుకున్నది. ప్రజలపై రుద్ది లబ్ధిపొందాలని చూస్తున్నారు.

మన ప్రభుత్వంను మనం గెలిపించుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు అద్యధికంగా గెలిపించుకోవాలి.

ఇంత అభివృద్ది చేసిన ప్రభుత్వం ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజలు అగం ఆగం కావద్దు వచ్చేది మళ్ళీ మనమే. అనుకున్న పనులన్నీ, మిగిలి ఉన్న అభివృద్ది పనులు మొత్తం పూర్తి చేసుకుందాం.

ఇది కూడా చదవండి: కందాళ సేవకు సలామ్