Telugu News

గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అవిర్భావ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ ప్రధాన భూమిక పోషించడం,దేశ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రం మారిపోవడం తథ్యం

0

గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అవిర్భావ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

== యావత్ దేశమిప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది

== బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నది

== కేసీఆర్ ప్రధాన భూమిక పోషించడం,దేశ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రం మారిపోవడం తథ్యం

== రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులు,గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాకారం చేయడమే కాక, దానిని గొప్పగా అభివృద్ధి చేసిన,చేస్తున్న  కేసీఆర్ మహానేత అని, వారి నాయకత్వాన ముందుకు సాగుతుండడం మన పూర్వజన్మ సుకృతం అన్నారు.రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీడువారిన మన భూములు,బోసిపోయిన మన గ్రామాలిప్పుడు పచ్చదనంతో కళకళలాడుతుండడం మన కండ్ల ముందున్న సత్యమని ఒక ప్రకటనలో రవిచంద్ర పేర్కొన్నారు.

ఇది కూాడా చదవండి: ప్రతిపక్షాలు ఆరోపణలకు అర్థం లేదు :రవిచంద్ర

తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకకపోవడమనేది గతమని, కేసీఆర్ ఆలోచనలు, ముందుచూపు, కార్యదీక్షతో ప్రజలందరికి శుద్ధిచేసిన నీళ్లు ఉచితంగా అందుతున్నాయన్నారు.ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాలు, మంత్రి కేటీఆర్ కృషితో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.దీంతో,ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,టెక్స్ టైల్స్, ఎయిరోస్పేస్ రంగాలు దూసుకుపోతున్నాయని, సుమారు 9లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా విజయవంతంగా అమలవుతుండడం, శాంతిభద్రతలు సజావు ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో గౌరవప్రదంగా జీవిస్తున్నారని రవిచంద్ర చెప్పారు.తెలంగాణ మాదిరిగానే దేశం కూడా సుభిక్షంగా ఉండాలనే దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ ను నెలకొల్పడంతో యావత్ దేశమిప్పుడు మహానేత కేసీఆర్ వైపు చూస్తున్నదని, వారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వద్దిరాజు పేర్కొన్నారు.బీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించడం, కేసీఆర్ ప్రధాన భూమిక పోషించడం..దేశ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రం మారిపోవడం తథ్యం అని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: అజాతశత్రువు రవిచంద్రుడు