Telugu News

పిమాకిన్ కర్మాగారంలో కార్మికుడు మృతి

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాం తరలింపు

0

పిమాకిన్ కర్మాగారంలో కార్మికుడు మృతి

👉గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాం తరలింపు

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని పిమాకిన్ కంపెనీలో ఆదివారం రాత్రి సీనియర్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.కార్మికుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుడు చర్ల మండలానికి చెందిన ఆవుల.మోహన్ రెడ్డి అనే కార్మికుడు కర్మాగారంలోనే మృతి చెందినప్పటికీ సంబంధించిన మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా తన కారులో మృతదేహాన్ని బయటకు తరలించారు. ఇందుకు సంబంధించిన విషయంలో అధికారులు మాత్రం కనీసం స్పందించకపోక ఈ కేసును తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

allso read :- రాయల గెలిచాడు.