Telugu News

నల్లా నీళ్ళల్లో మాంసపు ముద్దలు

భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

0

నల్లా నీళ్ళల్లో మాంసపు ముద్దలు

👉పంచాయతీ ల నిర్లక్ష్యం తో అబాసుపాలు అవుతున్న మిషన్ భగీరథ పథకం
👉లక్ష్మిపురం గ్రామం మిషన్ భగీరథ నీటిలో వచ్చిన మాంసపు ముద్దలు
👉భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

బూర్గంపహాడ్,జూన్ 23(విజయం న్యూస్ )

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛ మంచి నీటి సరఫరా కోసం మిషన్ భగీరథ అనే ఒక బృహత్తర పథకం ప్రవేశపెట్టి ఇంటి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మంచినీటి సరఫరా చేస్తోంది.కానీ అధికారులు, పంచాయతీల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు కొన్ని పంచాయతీల్లో అపరిశుభ్రమైన నీరు సప్లై అవుతుంది.ఇప్పుడు ఒక పంచాయతీ లో ఏకంగా మాంసపు ముద్దలు మంచి నీటి పైప్ లైన్ లో రావడం కలకలం సృష్టిస్తోంది.

Allso read:- కరకగూడెం టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. 

పూర్తి వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ నల్లాల నుండి మాంసపు ముద్దలు వస్తున్నాయి. నీళ్లు పట్టుకుందామని నల్లా తిప్పిన ప్రజలు నీటి తో పాటు మాంసం ముద్దలు వస్తుండటంతో అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు పై మూత లేదని గ్రామస్తులు అంటున్నారు.మూత లేకపోవడంతో వానరం లాంటి ప్రాణి ఏదైనా నీటిలో పడి మృతి చెందిందా లేదా మరేదైనా కారణంతో మాంసం వస్తుందా అని చర్చించుకుంటున్నారు. వాటర్ ట్యాంకుకు మూత లేకపోయినా స్థానిక అధికారులు, పంచాయతీ పాలకవర్గం పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇకనైనా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏది ఏమైనా నల్లా నీటిలో మాంసం రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Allso read:- ఆ పార్టీ వైపు తాటి చూపు

*పంచాయతీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్న ప్రజలు*

వాటర్ ట్యాంకు పై కనీసం మోత కూడా వేయకుండా నిర్లక్ష్యం వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా రోజుల నుంచి మూత లేకపోవడంతోనే వానరం లాంటి ప్రాణి ఏదైనా నీటిలో పడి మృతి చెందిందా లేదా మరేదైనా కారణంతో మాంసం వస్తుందా అని చర్చించుకుంటున్నారు.వాటర్ ట్యాంకుకు మూత లేకపోయినా స్థానిక అధికారులు, పంచాయతీ పాలకవర్గం పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇలాంటి మంచినీళ్లు సరఫరా వలన తాము చాలా ఇబ్బంది పడుతున్నామని ఇంటికి మంచి నీరు వస్తున్నా కూడ అవి తాగేలేని పరిస్థితిలో ఉన్నామని, ఇప్పటికి కూడా చాలా వరకూ మినరల్ వాటర్ బాటిల్ కొనుకొని తాగాల్సి వస్తుందని, అధికారులు ఇకనైనా పరిశీలించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరుతున్నారు.

*కనీస శుభ్రత పాటించడం లేదు..!*

మంచినీటి సరఫరా చేసే మంచినీటి ట్యాంక్ శుభ్రత చూసి గ్రామ ప్రజలు నోరెళ్లబెట్టారు. వాటర్ ట్యాంకు పై మూత లేకుండా, పాచి పట్టి అపరి శుభ్రంగా ఉండటం చూసిన జనాలు అవాక్కయ్యారు. ఇన్ని రోజుల నుంచి మేము తాగుతున్న నీరు ఇంత అపరిశుభ్రత ట్యాంకర్ నుంచి వస్తుందాఅని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మేలుకొని ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ ఆరోగ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

*భగీరథ పైపు పగడం వల్లనే(సెక్రటరీ )

ఈ విషయంపై విజయం రిపోర్టర్ సెక్రటరీ వివరణ కోరగా భగీరథ పైప్ లైన్ పగలడం వలన కప్పలు చేరి ఉంట్టాయి అని వాటర్ ప్రెజర్ వల్ల అవి చనిపోయి పైప్ లైన్ లో వచ్చి ఉంటాయని. త్వరలోనే వాటిని రిపేరు చేస్తామని సెక్రెటరీ అన్నారు.