ఇళ్లల్లోకి చేరిన మురుగు నీరు, వర్షపు నీరు
?పాలకవర్గం, సెక్రటరీ నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని ఆరోపిస్తున్న గ్రామస్తులు
? డ్రైనేజీ పూడ్చి డ్రైనేజీ పై ప్రహరీ గోడ కట్టిన గ్రామస్తుడు
? కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోని సెక్రటరీ పాలకమండలి..
బూర్గంపహాడ్, జులై 08(విజయం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టే నగర్ గ్రామంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరింది. భూక్యా వెంకటేశ్వర్లు ఇంటి వద్ద సైడ్ కాలువ డ్రైనేజీ మొత్తం నీటితో నిండిపోయి నీరు వెళ్లడానికి అవకాశం లేక మురుగు, వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరావత్ పంతులు అనే వ్యక్తి డ్రైనేజీ పూడ్చి దానిపై ప్రహరీ గోడ నిర్మించారు.
Allso read:- కూలీన ఇళ్ళు.. వృద్ధురాలుకు తృట్టిలో తప్పిన పెను ప్రమాదం
ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ పాలకమండలికి, కార్యదర్శికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. కనీసం మండల అధికారులయినా స్పందించి డ్రైనేజీ ని పూర్తి చేసి నీళ్లు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పినపాక పట్టి నగర్ గ్రామస్తులు కోరుతున్నారు.