Telugu News

బూర్గంపహాడ్ లో పెరిగిన దొంగతనాలు

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..!

0
ఇప్పటికైనా గాడిన పడేనా..?
== మండలంలో గాడి తప్పిన శాంతి భద్రతలు..!
== పెరిగి పోయిన దొంగతనాలు..!
== రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..!
== ప్రస్తుత ఎస్ఐ దారం.సురేష్ , అదనపు ఎస్ఐలు జీవన్ రాజు బదిలీ..
== బూర్గంపహాడ్ నూతన ఎస్ఐ గా పి. సంతోష్, అదనపు  ఎస్ఐగా రమణారెడ్డి.
(రిపోర్టర్ -రాజశేఖర్ రెడ్డి)
(బూర్గంపహాడ్-విజయంన్యూస్)
 *ప్రస్తుతం మండలంలో  పెరిగిపోతున్న దొంగతనాలు, ఇసుక మాఫియా  ను అరికట్టడానికి, గాడి తప్పిన శాంతిభద్రతలను,ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇష్టాను రాజ్యాంగ వ్యవహరిస్తున్న తీరును  పోలీసు ఉన్నతాధికారులు  దృష్టి లో ఉంచుకొని  పరిస్థితులను  మెరుగుపరచడానికి ఇది వరకే ఇక్కడ ఎస్ఐ గా పని చేసిన అనుభవం కలిగిన పి.సంతోష్ ను బూర్గంపహాడ్ నూతన ఎస్సైగా బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.*
 భద్రాద్రి కొత్తగూడెం మండలం  ప్రస్తుతo ఉన్న ఎస్సై సురేష్ ను ఇక్కడ నుంచి కొత్తగూడెం విఆర్ కు,అదనపు ఎస్ఐ జీవన్ రాజు ను కరకగూడెం ఎస్సైగా బదిలీ చేసారు. ఆళ్లపల్లి ఎస్సైగా పనిచేస్తున్న సంతోష్ ను బూర్గంపాడు ఎస్సైగా,అదనపు ఎస్ఐగా జి. రమణారెడ్డి ని నియమిస్తూ  మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పై గత కొంతకాలంగా వెలబడుతున్న విమర్శలపై, మండలంలో లోపించిన శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో సంతోష్  బూర్గంపాడు ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉన్నందున బూర్గంపహాడ్ కు బదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు పి. సంతోష్. గురువారం రాత్రి బూర్గంపహాడ్ ఎస్ఐ గా బాధ్యతలు స్వికరించారు. అయితే ఆయనకు దొంగతనాల కేసులు పెద్ద చాలెంజ్ గా మారనున్నాయి..
  *పెరిగిపోయిన దొంగతనాలు..?*
గత కొన్ని నెలలుగా  మండలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఏ గ్రామంలో చూసిన వరస దొంగతనాలతో దొంగలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంటికి తాళం వేశారా ఇక మీ ఇల్లు గుల్లవటం ఖాయం. లక్ష్యం పురం లో ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనాలతో దొంగలు పోలీసులకు పెద్ద సవాల్ విసిరారు.అది మొదలు మండలంలో వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు.దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో  ఆ దృశ్యాలు,వాళ్ల ముఖ చిత్రాలు సృష్టంగా కనపడిన్నప్పటికీ వారిని పట్టుకోవడంలో ఎస్ఐ ఎందుకు విఫలం అయ్యారన్న సందేహాన్ని పలువురు వక్తం చేస్తున్నారు.
 *రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..!* మాఫియా కు అడ్డు కట్ట  వేయగలరా..?            ఇది కూడా చదవండి: బండి సంజయ్ కి పిచ్చిలేసింది
 మండలంలో సారపాక, బూర్గంపహాడ్, సోంపల్లి, బుడ్డగూడెం, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, మొరంపల్లి బంజారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయాయి.గోదావరి గోసించేలా ,కిన్నెరసాని  వాగు కనుమరుగేయాలా నుంచి నిత్యం పదుల సంఖ్యలో  ట్రాక్టర్లు,లారీల ద్వారా “అడ్డు అదుపు’ “రాత్రి పగలు” తేడా లేకుండా అక్రమ సంపాదననే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చపోతున్నారు. కిన్నెరసాని అడ్డాగా ప్రస్తుతం సోంపల్లి, బుడ్డ గూడెం లో  దాదాపు 12 నుంచి 15 మంది ట్రాక్టర్స్ ఓనర్స్ ,3 నుంచి 5 గురు బడా లారీ ఓనర్లు మీలాఖత్ అయి రాత్రి కిన్నెరసాని వాగు నుంచి ట్రాక్టర్ల, ఎడ్ల బండ్ల ద్వారా స్టాక్  పాయింట్లు పోసి   జెసిబిల ద్వారా లారీలకు ఎత్తు తు రాత్రికి రాత్రి పాల్వంచ, కొత్తగూడెం, ఇతర ప్రాంతాలకు  తరలిస్తూ కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.ఈ ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో కూడా ఎస్సై పూర్తిగా వైఫల్యం చెందినట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెళ్లి వేత్తయి.  ఈ అంశాలు మొత్తం నూతనంగా వస్తున్నా ఎస్ఐ పి.సంతోష్ సవాలుగా మారనున్నాయా..? దొంగలను పట్టుకొని దొంగతనాలను అరికట్టగలరా..? ఇసుక మాఫియా ను అడ్డుకోగలరా..? లేక అందరి లనే చూస్తూ ఇసుక మాఫియా ను వదిలేస్తారా..?మండలంలో లోపించిన శాంతి భద్రతలను  గాడిన పెట్టగలరా..? ఇలా సామాన్య ప్రజలు ఎన్నో సందేహాలను వక్తం చేస్తున్నారు. గతంలో ఎస్ఐగా పనిచేసి శభాష్ అనిపించుకున్న ఎస్ఐ సంతోష్  ఏ మేరకు వీటిని కట్టడి చేయగలరో వేచి చూడాలి..