Telugu News

పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

"మన ఊరు -మనబడి " కార్యక్రమానికి అర్థం మార్చేసిన కాంట్రాక్టర్

0

పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

? “మన ఊరు -మనబడి ” కార్యక్రమానికి అర్థం మార్చేసిన కాంట్రాక్టర్
? నాసిరక నిర్మాణంతో కాంట్రాక్టర్ మాయాజాలం
? శిథిలావస్థ గోడల పైనే స్కూలు భవన నిర్మాణం
? నాసిరక ఇటుకలు,మెటీరియల్ వాడుతున్నారని పలు ఆరోపణలు ..!
? ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఇంజనీర్ దురుసు ప్రవర్తన..!
? పాత భవనం వద్దు కొత్త భవనమే కావాలంటున్న స్కూల్ పిల్లల తల్లి తండ్రులు.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 20(విజయం న్యూస్ )

తెలంగాణ ప్రభుత్వo ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి కోసం ” మన ఊరు మనబడి “కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్స్ పునరుద్ధరీకరణ,ప్రతి స్కూల్ కు విద్యార్థుల సంఖ్యను భట్టి నూతన బిల్లింగ్ నిర్మాణాలు చేపట్టుట ఇలా పలు కార్యక్రమాలు చేస్తారు. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అత్యాశ తోటి నాసిరక నాసిరకం నిర్మాణాలు చేస్తూ పిల్లల ప్రాణాల తో చెలగాటం ఆడుతు “మన ఊరు-మన బడి ” పథకం అర్ధమే మార్చేస్తున్నారు.

పూర్తి వివర్లో కి వెళితే

allso read- టెన్షన్ ఎందుకు దండగా…! పొంగులేటి అండ ఉండగా…!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రాంతంలోని మసీద్ రోడ్ నందు ఉన్న ఎంపీపీఎస్ పాఠశాల ఎంతో పురాతనమైనది పాఠశాల అని స్థానిక తల్లిదండ్రులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి నిర్మాణం పేరుతో పాఠశాలల మరమ్మతుల నిర్మాణం కోసం 18 లక్షల రూపాయల పైచిలుకు వెచ్చించింది. పురాతన పాఠశాలలను తొలగించి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులతో కలిసి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే పట్టణంలో సుమారు 40 సవంత్సరాల పై చిలుకు ఎంపీపీఎస్ పాఠశాల ఉందని ఆపాఠశాల గోడలు గతంలో పిల్లర్ లేకుండా నిర్మించడం జరిగిందని ఇప్పుడు ఆ గోడలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పుతున్నారు.”మనఊరు మనబడి” పేరుతో ఎంపీపీఎస్ నూతన పాఠశాల నిర్మాణం చేపట్టాల్సింది ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాత పాఠశాల గోడల పైనే నిర్మాణం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

allso read- ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్
పాత బడి వద్దు కొత్త బడే ముద్దని తల్లిదండ్రులు చెబుతున్నారు.గత కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఇదే బడిలో చదువుకున్నామని అప్పుడే గోడలు,కూలిపోయే స్థితిలో ఉండేయని తెలిపారు. అలాంటిది ఏ ఉద్దేశంతో పాత బడిపై నిర్మాణం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం నూతన నిర్మాణం చేపట్టామని నిధులు కేటాయిస్తే నిధులు పక్కదారి పట్టించి పాతబడిపై అడపా దడపా నిర్మాణం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై భవన నిర్మాణం పరిరక్షిస్తున్న ఇంజనీర్ ను ప్రశ్నిస్తే మీకేం తెలుసు మా కంటే ఎక్కువ మీకు తెలుసా అంటూ తల్లిదండ్రుల పై తిరుగుబాటు చేస్తున్నాడని చెబుతున్నారు.ఇప్పటికైనా జిల్లా కలక్టర్ స్పందించి గాలిలో నిర్మించే భవనాలు కాకుండా పూర్తిస్థాయిలో పాఠశాల భవనాన్ని నిర్మించేలా చర్యలు తీసుకొని వీరికి ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేసి మరో కాంట్రాక్టర్ తో మరో ఇంజనీరును పెట్టి నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేనిచో పాఠశాల భవనం ముందు నిరాహార దీక్ష చేస్తామని తల్లిదండ్రుల హెచ్చరిస్తున్నారు…

== పిల్లర్స్ తోటి స్కూల్ బిల్డింగ్ నిర్మాణo చేయాలి:- (హెచ్. ఎం సత్యనారాయణ )

40 సంవత్సరాల గోడపై బిల్డింగ్ నిర్మాణం చేపడితే కూలిపోయే ప్రమాదం వుంది. అలా కాకుండా నూతనంగా పిల్లర్స్ తోటి స్కూలు భవన నిర్మాణం చేపట్టాలని మా స్కూల్ తరఫున యాజమాన్యం తరఫున కలెక్టర్ కి విన్నవించుకుంటున్నాను.

== పిల్లల ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఆ బిల్డింగ్ నిర్మిస్తే సహించేది లేదు:- (సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు)

సారపాక జిల్లా పరిషత్ స్కూల్లో తల్లిదండ్రులు ఆవేదన చెందుతు మీడియా ముందుకు వచ్చారు కానీ అది వాస్తవంగా 18 లక్షల తోటి నిర్మిస్తున్న బిల్లింగ్ కి పిల్లర్లు లేకుండా పాత గోడల మీద స్లాబ్ వేస్తే ఎలా ఆగిద్ది అది వెంటనే బూర్గంపాడు ఎంఈ

ఓ సమ్మయ్య దీనిపైన స్పందించాలని ఇది వాస్తవాలు అవాస్తవాలు అనేది తేల్చాల్సిన బాధ్యత మిపై ఉందని,నిర్మిస్తున్న కాంట్రాక్టు మరి ఎవరు అతను అంత దారుణంగా నాన్నతలేని బిల్డిం

గ్ నిర్మించి లక్షల లక్షలు ఎలా తినాలని చూస్తున్నారు పిల్లల ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఆ బిల్డింగ్ నిర్మిస్తే సహించేది లేదని సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన సరైన చర్యలు ప్రభుత్వం గాని అధికారులు గాని చర్యలు తీసుకోపోతే పిల్లల తల్లిదండ్రుల తోటి ఆందోళన చేపడతామని ఆయన అన్నారు.