Telugu News

ఏజెన్సీలో బినామీల దందా..?

పంచాయతీ పర్మిషన్ లేకుండానే బహుళ అంతస్తు నిర్మాణం

0
ఏజెన్సీలో బినామీల దందా..?
? పంచాయతీ పర్మిషన్ లేకుండానే బహుళ అంతస్తు నిర్మాణం
? నిర్మాణం పూర్తి దశ లో బినామీల పేరుతో  అనుమతులు కోరుతు వినతి పత్రం ..?
? గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్న గిరిజనేతరులు..!
? బినామీల పేరుతో బహుళ అంతస్తుల యథేచ్ఛ గా నిర్మాణం..!
? ఇంటి పన్ను లేకుండానే కరెంట్ మీటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు.
? వివరణ అడిగిన విలేకరికి సరైన సమాధానం చెప్పకుండా  “ఆర్టిఐ” వేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చిన విద్యుత్ శాఖ ఏఈ
(రిపోర్టర్- రాజశేఖర్ రెడ్డి)
(బూర్గంపాడు-విజయంన్యూస్)
” *ధన బలం, రాజకీయ బలం” మెండుగా ఉంటే  ఎలాంటి  చట్టాల నైన తమ చుట్టాలుగా మార్చి అధికారులను సైతం తమ కన్ను సన్నలతో ఆడిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా  ఏదైనా చేయొచ్చు  అనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది సారపాక లోని లారీ యార్డ్ పక్కన నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణం.*
  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ రోజురోజుకూ బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి. రాజకీయ పలుకుబడులను ఉపయోగిస్తూ కనీస అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల బడాబాబులు కొంతమంది బరితెగింపు నిర్మాణాలు చేపడుతున్నారు. గిరిజన చట్టమైన 1/70 పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమ
తి ఉండదు. అయినప్పటికీ కొంతమంది అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.
గిరిజనేతరులు చట్ట వ్యతిరేకంగా బహుళ అంతస్తులకు అధికారులు నోటీసులు ఇచ్చినా ఆగని నిర్మాణ పనులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలో అనుమతులు లేని బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా నిర్మాణ పనులు ఆగలేదు. గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే భావన నిర్మాణ పనులను ఆపాలని రెండు దపాలు నోటీసులను జారీీీీ చేసినప్పటికీ పంచాయతీ అధికారుల ఆదేశాలను సవాల్ చేస్తూ నోటీసులకు మమ్ములను ఏం చేస్తాయి అంటూ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసే దశకు తీసుకువచ్చారు.  ఏది ఏమైనా అధికారులను సవాల్ చేస్తూ నిర్మాణాన్ని పూర్తి దశకు తీసుకురాగలిగిన ఆ పెద్ద మనుషులకు ధన బలం రాజకీయ మెండుగా ఉండటం వల్ల ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణం నిరాటంకంగా సాగుతున్నదని ప్రచారం…
ఈమధ్య కాలంలో వ్యాపారాలు గణనీయంగా పెరగడంతో వ్యాపార సముదాయాలు ఊహించని రీతిలో విస్తరించాయి. భద్రాచలం నుండి ఖమ్మం, హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడం మరొకవైపు ఐ టి సి పరిశ్రమ ఉండడం వలన మండలంలో ఉన్న భూములలో అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఈ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి అని తెలిసినా ధన బలం రాజకీయ అండదండలు ఉన్న కొంతమంది బరితెగించిన, బడాబాబులు బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టి కళ్ళముందే పూర్తి చేస్తున్నారు. దాన్ని ఆపాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతూ పనులు కానిచ్చేలా చేస్తున్నారు అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
==  *బినామీ పేరుతో అనుమతులకు వినతి పత్రం ఇచ్చిన బడా బాబు..?*
 బహుళ అంతస్తుల నిర్మాణంపై “నిబంధనలు మాకు వర్తించవు ” అనే శీర్షికతో  “విజయం” పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ ఈవో మహేష్ నోటీసులు జారీ చేయగా  బిల్డింగ్  నిర్మాణం చేపట్టిన సదరు వ్యక్తి  ఎస్టి పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ బిల్డింగ్ నిజంగా ఎస్టీ పేరు మీద  ఉందా..? లేక బడా బాబు  ఏజెన్సీ చట్టాలను తప్పు దోవ పట్టించి చట్టాన్ని వాడుకోవడానికి ఎస్టీ ని బినామీగా పెట్టి అనుమతి పత్రం పొందాలనుకుంటున్నాడా..? అధికారులు పారదర్శకంగా   విచారణ చేపట్టి నిజా నిజాలు తెలుస్తారా..? వేచి చూడాలని పలువురు గిరిజనలు గుసగుసలాడుకుంటున్నారు.
== నామ్ కే వాస్తు  నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సారపాక పంచాయతీ అధికారులు:-*
ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం పంచాయతీ పర్మిషన్ తీసుకొని   నిర్మాణలు చేపట్టాలి. కానీ ఇక్కడ బడా బాబులు ఏలాంటి పర్మిషన్ లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణం చేసి గిరిజన చట్టాలకు కాలరాస్తున్నారు. సారపాక లారీ యార్డ్ పక్కన ఎలాంటి పంచాయతీ పర్మిషన్ లేకుండా నె బహుళ అంతస్తు నిర్మాణం చేస్తున్నారు.ఈ విషయంపై సారపాక ఈవో మహేష్ ను విజయం రిపోర్ట్ వివరణ కోరగా తాము ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని  మేము భవన నిర్మాణ దశలోనే   నోటీసులు ఇచ్చామని,కానీ వారు ఎలాంటి  సమాధానం చెప్పకుండానే నిర్మాణం చేశారని సమాధానం ఇచ్చారు. అయితే నామ్ కే వాస్తు నోటీసు ఇచ్చి చేతులు దులుపు కోవడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం ఐతున్నాయి.
 *నాకు తెలియదు సమాచారం కోసం “ఆర్టిఐ” వేసుకోండి( సారపాక విద్యుత్ శాఖ ఏఈ ఉపేందర్ ):-*
 బహుళ అంతస్తుల నిర్మాణానికి  విద్యుత్ శాఖ వారు కేటాయించిన కరెంటు  మీటర్ ను ఎవరి పేరు మీద ఉందని వేలేఖరు సారపాక విద్యుత్ శాఖ ఏఈ నీ వివరణ కోరగా నాకు తెలియదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పడమే కాకుండా విలేకరులతో దురుసుగా మాట్లాడుతూ ” ఆర్టిఐ” వేసుకోండి సమాచారం తెలుస్తుంది అని  సదరు సారపాక విద్యుత్ శాఖ అధికారి విలేకర్ కు సమాధానం  చెప్పడంపై సర్వత్తర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 *అనుమతి లేని నిర్మాణానికి “నాట్ ఫర్ రిసేల్ ” సిమెంటు వాడకం:-*
 ఏజెన్సీలో బహుళ అంతస్తులు నిర్మాణానికే అనుమతులు లేవు అనుకుంటే  అ బహుళ అంతస్తులు నిర్మాణానికి సైతం ప్రభుత్వ  పనులకు  మాత్రమే ఉపయోగించే “నాట్ ఫర్ రీసేల్ ” సిమెంట్ ను వాడుతూ  చట్టాలను పూర్తిగా తన చుట్టాలుగా మార్చేస్తున్నారు. ఈ విషయంపై పలమార్లు పత్రికలలో ప్రచురించిన సంబంధిత అధికారులు స్పందించటకపోవడంపై  సామాన్యులు తమకే నా చట్టాలు బడా బాబులకు ఏముండవా అని  అధికారులను ప్రశ్నిస్తున్నారు.