Telugu News

బూర్గంపహాడ్ మండలం సారపాకలో బుల్లెట్ చోరీ

ఆభరణాలతో పాటు బుల్లెట్ చోరీ చేసిన దుండగులు

0

బూర్గంపహాడ్ మండలం సారపాకలో చోరీ

** ఆభరణాలతో పాటు బుల్లెట్ చోరీ చేసిన దుండగులు

(రిపోర్టర్ -రాజశేఖర్ రెడ్డి)

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25(విజయం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక స్థానిక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి సుబాని కుటుంబంతో ఊరు వెళ్లడంతో ఇదే అదునుగా ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి వెండి ఆభరణాలు చోరీ. ఆభరణాలతోపాటు ఇంటి బయట నిలిపి ఉంచిన బుల్లెట్ బండి ఎత్తుకెళ్లిన దొంగలు.ఇంటి తలుపులు తెరిచి ఉంచడం చూసిన పక్కింటి వాళ్ళు సుభాని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Allso read:-  బెల్లం వేణు… నీ చరిత్ర విప్పవమంటావా..?: మౌలానా

వాళ్ళు వచ్చి చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సాయంతో వివరాలు సేకరించారు.ఇంట్లోనే మరో గదిలో బీరువా జోలికి పోని దొంగలు. అందులో 50 తులాల బంగారం సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న ఇంటి యజమాని సుబాని. బంగారం సురక్షితంగా ఉండడం ఇంటి యజమానితోపాటు పోలీసులను సైతం ఆశ్చర్యాన్ని గురిచేసింది.పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది.

Allso read:- క్రిష్ణయ్య హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం: బీజేపీ లీగల్ సెల్