Telugu News

అక్రమ మద్యాన్ని  అరికట్టాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

మాకొద్దు మాకొద్దు బెల్ట్ షాప్ మాకొద్దు

0
అక్రమ మద్యాన్ని  అరికట్టాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
== మాకొద్దు మాకొద్దు బెల్ట్ షాప్ మాకొద్దు
== బెల్ట్ షాప్ లను కట్టడి చేయండి
== అధికారులు మేలుకోవాలి అంటూ నినాదాలు చేశారు
(REPORTER-RAJASHEKAR REDDY)
బూర్గంపహాడ్, అక్టోబర్ 12(విజయం న్యూస్ )
బూర్గంపహాడ్ మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం నిషేధం చేయాలనీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేసారు. ఈ సందర్బంగా పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ గత కొద్దికాలంగా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో గల మద్యం దుకాణాల యజమానులు విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు.
దీనివలన 24 గంటలు ఎక్కడపడితే అక్కడ గుడి బడి నేషనల్ హైవే లు అనే తేడా లేకుండా మధ్య అందుబాటులో ఉండటం వలన యువకులు మద్యానికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా అర్ధరాత్రి మహిళా ప్రయాణికులు బయటకు రావాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు  గురి అవుతున్నారని ఎన్. హెచ్ రోడ్డు పక్కన మద్యం విక్రయించడం వలన లారీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు,. మహిళలు మాట్లాడుతు పారిశ్రామిక ప్రాంతం కావడం వలన కార్మికుల ఎటిఎం తీసుకుని మరి మధ్యాహ్న ఇస్తున్నారు తద్వారా కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఇట్టి విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ ఎస్ఐ , ఎక్సైజ్ సీఐ , ఎక్సైజ్ కమిషనర్ కి సమాచారం అందించిన తగిన ఫలితం లేదని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సారపాక లోని మద్యం దుకాణాల వర్ధ తమ నిరసన తెలియజేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దేవి,  యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాదె విజయ్ కుమార్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రహీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.