Telugu News

బూర్గంపాడు ఎస్టి గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం.

విద్యార్థి కన్ను కోల్పోయే ప్రమాదం..? హైదరాబాద్ లో చికిత్స

0

నిర్లక్ష్యం ఖరీదు..ఓ విద్యార్థి కంటి చూపు..!

? బూర్గంపాడు ఎస్టి గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం.

? కంటికి దెబ్బ తగిలిన విద్యార్థి పట్ల  నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్.

?అందుబాటులో లేని వార్డెన్

? సకాలంలో స్పందించకపోవడంతో కన్ను కోల్పోయే ప్రమాదం..?

? మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు తరలింపు.

?నిర్లక్ష్యం వహించినా వార్డెన్,ప్రిన్సిపాల్ ను  సస్పెండ్ చేయాలని కోరుతున్నా విద్యార్థి సంఘం

(రిపోర్టర్ : రాజశేఖర్ రెడ్డి)

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12(విజయం న్యూస్ )

వార్డెన్ నిర్లక్ష్యమో..? ప్రిన్సిపాల్ వైఫల్యమో ఏమో కానీ ఓ విద్యార్థి ప్రాణాల మీదకు వచ్చింది..  కూలినాలి చేసుకుంటూ  పూట గడవక  తమ లాగా తమ పిల్లలు పస్తులు ఉండకుండా కడుపు నిండా మూడు పూటలా తింటూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ తమలాగా కూలి పనులతో కష్ట పడకుండా  ప్రయోజికులు అవ్వాలన్న ఆశ తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో విద్యార్థులను తల్లిదండ్రులు జాయిన్ చేయిస్తూంటే, అక్కడ వున్నా ఉపాధ్యాయులు, కేర్ టేకర్స్, వార్డెన్  ప్రభుత్వం ఇస్తున్న లక్షల వేతనాలను తీసుకుంటు వారి పట్ల  నిర్లక్ష్యం వహిస్తూ  వారి భవిష్యత్తును ఆగమగోచరంగా మార్చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : మునిగేపల్లికి ఆర్టీసీ బస్సు..ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ

విద్యార్థిల తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ప్రిన్సిపాల్ వార్డెన్ నిర్లక్ష్యంతో ఒక విద్యార్థికి కను చూపు పోయే సంఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎస్టి గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరిగింది. ఇక పూర్తి వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో జోగయ్య అనే ఒక విద్యార్థి తన స్నేహితుని పుస్తకం లాక్కునే క్రమంలో పక్కన ఉన్న రాకేష్ కు ప్రమాదవశాత్తు పెన్సిల్ గుచ్చుకుని కంటికి గాయం అయింది. వెంటనే స్పందించాల్సిన ప్రిన్సిపాల్ స్పందించకపోగా,హాస్పిటల్ కి తీసుకెళ్లకపోవడంతో  హాస్టల్ లో వంట చేసే వాళ్ళ చిన్న అబ్బాయి (12 నుంచి 15 వయసు )చెత చికిత్స నిమిత్తం పంపించారు. సదరు ప్రిన్సిపాల్ హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా హాస్టల్ లో వంట చేసే వంట మనిషి కుమారుని చేత మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం పంపించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు పంపించడంతో అక్కడ ప్రత్యేక వైద్యులు లేరని తెలిపి పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించారు. దీంతో అక్కడ ప్రత్యేక నిపుణులు లేకపోవడంతో వారు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో కంటికి గాయమైన విద్యార్థినిని వంట మనిషి కొడుకు వైద్యశాలకు తీసుకెళ్లడంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం వారు అసలు ఏమైంది ఎందుకు నువ్వు తీసుకువచ్చావు ప్రిన్సిపాల్, వార్డెన్ ఎక్కడ అని ప్రశ్నించగా స్కూల్లో ఉన్నారని బాలుడు సమాధానం చెప్పాడు.

ఇది కూడా చదవండి: మంత్రి అజయ్ పై అసత్య ప్రచారం తగదు:-కార్పోరేటర్

దానితో ప్రిన్సిపాల్ ను వివరణ అడగడానికి వచ్చిన వారితో మీరు స్కూల్ లోపలికి రావడానికి వీలు లేదు అని వారి తో వాగ్వాదానికి దిగడంతో విద్యార్థి సంఘం నాయకులు స్కూలు ముందు కాసేపు ధర్నా చేశారు.

==  అందుబాటులో లేని వార్డెన్ సంతోష్

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను చూసుకోవాల్సిన వార్డెన్  సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థి కి కన్ను పోయే పరిస్థితి వచ్చిందని విద్యార్థి సంగం నాయకులు చెబుతున్నారు.స్థానికంగా ఉంటూ హాస్టల్లో ఉంటున్న పిల్లలు చూసుకోవాల్సిన వార్డెన్ భద్రాచలంలో నివాసముంట్టు తనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తూ పోతూ ఉంటున్నాడని పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉండడని అక్కడ స్థానికులు చెబుతున్నారు.వార్డెన్ లేకపోవడంతో  విద్యార్థులు బయట తిరుగుతూ తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని కొన్ని నెలల క్రితం ఆ పాఠశాలలో చదివే  విద్యార్థులు గోదావరి  నది వద్దకు వెళ్లి  ఈత కొట్టడం చూసిన  స్థానికులు వార్డెన్ కు ఫోన్ చేసి చెప్పగా  వార్డెన్ వారి మాటలను కొట్టి పారేసి చులనక గా మాట్లాడుతూ  అలాంటిదేమీ లేదు, ఉంటే సాక్షాలు చూపించండి అంటూ  తమను ఎదురు బెదిరించాడు అని వారు చెబుతున్నారు.వార్డెన్ కు ప్రభుత్వం   పిల్లల సంరక్షణ చూసుకోమని వేతనం ఇస్తూ బాధ్యతాయుతమైన పదవిలో ఉంచితే తన బాధ్యతను మరిచి తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నడని నిర్లక్ష్యం వహించిన   వార్డెన్ పై చర్యలు తీసుకోని సస్పెండ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

==  ప్రిన్సిపాల్ ను వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

గాయం అయిన వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం వహించి విద్యార్థి  కన్ను చూపుకు ఇబ్బంది కలిగేలా చేసిన ప్రిన్సిపాల్, వార్డెన్ ను వెంట్టనే సస్పెండ్ చేయాలనీ విద్యార్థి సంగం వారు డిమాండ్ చేస్తున్నారు

 == ఇద్దరు పిల్లలు పుస్తకం లాక్కునే క్రమంలో పక్క వాడి కంటిలో పెన్సిల్ గుచ్చుకుంది : ప్రిన్సిపల్ దేవ్ సింగ్

ఈ విషయంపై ప్రిన్సిపల్ దేవ్ సింగ్ ని ప్రభాతవార్త వివరణ కోరగా తరగతి గదిలో రెండవ పీరియడ్ సమయంలో ఒకరి పుస్తకం ఒకరు తీసుకొని లాక్కునే క్రమంలో పక్కన ఉన్న రాకేష్ కంటికి పెన్సిల్ గుచ్చుకుంది తక్షణమే వంట మనిషిని ఇచ్చి వైద్యశాలకు పంపించానని తెలిపారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులతోపాటు హాస్టల్ వార్డెన్ సతీష్ ను పంపించడం జరిగిందని ఆయన తెలిపారు

== మెరుగైన చికిత్స కోసం ఎల్వి ప్రసాద్ తరలింపు

బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడగా రాకేష్ అనే విద్యార్థి కంటిలో ప్రమాదవశాత్తు పెన్సిల్ గుచ్చుకోవడం జరిగింది. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు  సమాచారం అందుకుని బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీలత దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జడ్పీటీసీ  పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో  జాయిన్ చేపించారు.మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో ఈ విషయాన్ని  ఎమ్మెల్యే రేగా కాంతారావు  దృష్టికి తీసుకెళ్లగా వెంటనే హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థికి మెరుగైన వైద్యం చేయించడం కోసం హైదరాబాద్ తీసుకెళ్తున్న వారి తల్లిదండ్రులకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రూ.5వేలను  జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ రావు ఆర్థిక సాయం అందజేశారు.